pawan water

త్రాగునీటి సమస్యను పరిష్కరించిన పవన్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గోల్లప్రోలు బాలుర ప్రాథమికోన్నత పాఠశాలలో నాలుగు సంవత్సరాలుగా ఉన్న త్రాగునీటి సమస్యను పరిష్కరించారు. ఆయన సూచనల మేరకు CSR నిధుల ద్వారా రూ. 4 లక్షలతో ఆర్‌ఒ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగింది.

గత నాలుగు సంవత్సరాలుగా రక్షిత త్రాగునీరు సదుపాయం లేక విద్యార్థులు పలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్య ఉపముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్లింది. వెంటనే రంగంలోకి దిగిన డిప్యూటీ సీఎం సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సమీపంలోని శ్రీ వేంకటేశ్వర రైస్ మిల్ వద్ద మంచినీరు వస్తున్న విషయాన్ని అధికారులు గుర్తించారు. రైస్ మిల్ యాజమాన్యంతో మాట్లాడి వారిని ఒప్పించారు. 4 లక్షల CSR ( Corporate Social Responsibility) నిధులతో ఆర్వో ప్లాంట్ కు రైస్ మిల్ నుండి మంచినీటి సరఫరా ఏర్పాటు చేయడం కోసం డెడికేటెడ్ పైప్ లైన్ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో విద్యార్థులకు స్వచ్ఛమైన రక్షిత త్రాగునీరు అందించేలా వెంటనే చర్యలు తీసుకున్న అధికార యంత్రాంగం, శ్రీ వేంకటేశ్వర రైస్ మిల్ యాజమాన్యానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

Related Posts
మంత్రులకు సీఎం దిశా నిర్దేశం.
chandrbabu naidu

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేబినెట్ సమావేశం జరిగిన తరువాత మంత్రులతో వేరుగా భేటీ అయ్యారు.పలు కీలక అంశాలను పేర్కొన్నారు. అందరూ గేర్ మార్చాలని.. పనితీరు మెరుగుపరుచుకోవాలని Read more

మహాకుంభ మేళలో భారీ అగ్నిప్రమాదం
మహాకుంభ మేళలో భారీ అగ్నిప్రమాదం

ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభ మేళాలో ఆదివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. 45 రోజుల పాటు జరుగుతున్న మహాకుంభ మేళాలో ఈ చేదు సంఘటన సెక్టార్ 19లో ఉన్న Read more

సచివాలయాన్ని ముట్టడించిన బెటాలియన్‌ కానిస్టేబుల్ కుటుంబాలు
families of the battalion constables who besieged the secretariat

హైదరాబాద్‌ : రాష్ట్రంలోని జిల్లాల్లో కొన్ని రోజులుగా సాగుతున్న బెటాలియన్‌ పోలీసుల కుటుంబాల ఆందోళనలు హైదరాబాద్‌ చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో, ఈరోజు రాష్ట్రంలో కానిస్టేబుల్‌ భార్యలు తమ Read more

బాబా రాందేవ్‌పై అరెస్ట్‌ వారంట్‌
Arrest warrant for Baba Ramdev

తిరువనంతపురం : పతంజతి ఆయుర్వేద్‌ ప్రజలను తప్పుదోవపట్టించే ప్రకటనలు ఇస్తోందని దాఖలైన ఫిర్యాదుపై కేరళలోని పాలక్కడ్‌ జిల్లా కోర్టు బాబా రామ్‌దేవ్‌, ఆయన సన్నిహితుడు ఆచార్య బాలకృష్ణలపై Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *