హిందూ ధర్మంపై మాట్లాడే హక్కు పవన్‌కు లేదు: జగన్

YS Jagan : హిందూ ధర్మంపై మాట్లాడే హక్కు పవన్‌కు లేదు: జగన్

YS Jagan: హిందూ ధర్మం, ఆలయాల పరిరక్షణపై మాట్లాడే హక్కు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు లేదని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు. కశీనాయన క్షేత్రాన్ని కూల్చేస్తుంటే పవన్‌ ఒక్క మాట కూడా మాట్లాడలేదని ఎక్స్‌లో మండిపడ్డారు. ఆలయాల పట్ల తమకు ఉన్న చిత్తశుద్ధి కూటమి ప్రభుత్వానికి లేదన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే కాశీనాయన ఆలయాన్ని కూటమి ప్రభుత్వం కూలుస్తోంది. ఆ ఆలయ అభివృద్ధికి వైసీపీ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.

Advertisements
 హిందూ ధర్మంపై మాట్లాడే హక్కు పవన్‌కు లేదు: జగన్

ఆధ్యాత్మిక శోభ విలసిల్లింది? ఎవరి హయాంలో

దేవుడు అంటే భక్తి, భయం ఉన్నది ఎవరికి? ఎవరి హయాంలో ఆధ్యాత్మిక శోభ విలసిల్లింది? ఎవరి హయాంలో హైందవ ధర్మాన్ని పరిరక్షించారు? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రసిద్ధ కాశినాయన క్షేత్రంలో కూల్చివేతలు, రాష్ట్రంలో ఆలయాలపైన, హిందూ ధర్మంపై జరుగుతున్న దాడులకు ప్రత్యక్ష సాక్ష్యాలు కావా?” కూటమి ప్రభుత్వాన్ని వైఎస్‌ జగన్‌ ప్రశ్నించారు. ”అటవీ ప్రాంతంలో ఉన్న కాశీనాయన క్షేత్రంలో నిర్మాణాల నిలిపివేత, వాటి తొలగింపుపై ఆగస్టు7, 2023న కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ ఆదేశాలు ఇచ్చినా, ఆ క్షేత్ర పరిరక్షణకు మా ప్రభుత్వం నడుంబిగించిన మాట వాస్తవం కాదా?

మా పాలనలో కాశినాయన క్షేత్రానికి వ్యతిరేకంగా ఒక్క చర్య తీసుకోలేదు

అదే నెల ఆగస్టు 18, 2023న అప్పటి కేంద్ర అటవీశాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌ కి ముఖ్యమంత్రి హోదాలో నేనే స్వయంగా లేఖరాసి కాశినాయన క్షేత్రం ఉన్న 12.98 హెక్టార్ల భూమిని అటవీశాఖ నుంచి మినహాయించాలని, ఆ క్షేత్రానికి రిజర్వ్‌ చేయాలని, దీనికోసం ఎలాంటి పరిహారం కోరినా, ఎలాంటి ఆంక్షలను విధించినా తు.చ.తప్పక పాటిస్తామని లేఖలో చాలా స్పష్టంగా చెప్పాం. మా ప్రయత్నాలతో కేంద్రం తన చర్యలను నిలుపుదల చేసింది. మా ఐదేళ్ల పాలనలో కాశినాయన క్షేత్రానికి వ్యతిరేకంగా ఎవ్వరూ ఒక్క చర్యకూడా తీసుకోలేదు.

Related Posts
స్వయం ఉపాధి రుణ పథకాల్లో కీలక మార్పులు
స్వయం ఉపాధి రుణ పథకాల్లో కీలక మార్పులు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెనుకబడిన తరగతులు (బీసీ) మరియు ఆర్థికంగా బలహీన వర్గాల (ఈడబ్ల్యుఎస్) పేదరికాన్ని తగ్గించడంపై దృష్టి సారించి, స్వయం ఉపాధి సబ్సిడీ రుణ పథకాలకు కొత్త Read more

Alekhya Chitti Pickles: అలేఖ్య చిట్టి పికిల్స్ కాంట్రావర్సీపై స్పందించిన రమ్య
Alekhya Chitti Pickles: అలేఖ్య చిట్టి పికిల్స్ కాంట్రావర్సీపై స్పందించిన రమ్య

కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఓ పేరు తెగ చక్కర్లు కొడుతోంది – అదేఅలేఖ్య చిట్టి పికిల్స్. రాజమండ్రి కేంద్రంగా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకే కాకుండా Read more

DANGER: ఆల్కహాల్ తాగుతున్నారా?
Are you drinking alcohol

మద్యం సేవించే అలవాటు వల్ల 40 ఏళ్ల వ్యక్తి వెంటిలేటర్ పై చావుబతుకుల్లో ఉన్నాడు. మద్యం తాగితే కాలేయం పాడవుతుందని పొరబడుతుంటారు. కానీ, ఆల్కహాల్ అనేది విషంతో Read more

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌- 12 మంది మావోయిస్టుల మృతి
Massive encounter in Chhatt

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులపై భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్‌లో భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. బీజాపూర్ జిల్లాలోని నేషనల్ పార్క్ సమీపంలో భద్రతా బలగాలు, నక్సల్స్ మధ్య జరిగిన ఎదురు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×