OG మూవీ ఫై పవన్ కళ్యాణ్ క్లారిటీ

జనసేన అధినేత , ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎంత బిజీ గా ఉన్నాడో తెలియంది కాదు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన క్షణం నుండి నిమిషం కూడా వృధా చేయకుండా పనిచేస్తున్నాడు. ప్రజల సమస్యలు తెలుసుకోవడం , అధికారులతో సమీక్షలు జరపడం, ఏంచేస్తే రాష్ట్రం అభివృద్ధి చేస్తుందో వంటివి తెలుసుకోవడం వంటివి చేస్తూ వస్తున్నారు. గత రెండు రోజులుగా కాకినాడ జిల్లాలో పర్యటిస్తున్న ఈయన..ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించి సభ ఏర్పాటు చేశారు.

ఈ సందర్బంగా ఆయన సినిమాల ఫై క్లారిటీ ఇచ్చారు. అభిమానులు OG, OG అంటూ అరవడం మొదలు పెట్టారు. దీంతో పవన్ నవ్వూతూ స్పందిస్తూ.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రజలకు మెరుగైన పాలనపై దృష్టి కేటాయించామని.. ఈ సమయంలో మనం ప్రజలకు చేయాల్సిన పనులు వదిలేసి సినిమా షూటింగ్ లో పాల్గొంటే ప్రతిపక్షాలు ప్రశ్నిస్తాయని అన్నారు. తనను నమ్మి ఇంతటి భారీ విజయాన్ని అందించిన ప్రజలకు సేవ చేసుకుంటూ కుదిరినప్పుడల్లా నెలలో రెండు, మూడు రోజులు సినిమా షూటింగ్‌లో పాల్గొంటానని తెలిపారు. ఇదే విషయంపై తాను ఒప్పుకున్న సినిమాలకు సంబంధించిన ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లకు తన షేడ్యూల్ తయారు చేసుకొవాలని చెప్పినట్లు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. అలాగే త్వరలో షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కాబోతున్న OG సినిమాను అందరూ చూడాలని, ఆ సినిమా చాలా బాగుంటుందని చెప్పుకొచ్చారు.