Pawan Kalyan anger over the demolition of Muthyalamma statue in Secunderabad

సికింద్రాబాద్ ముత్యాలమ్మ విగ్రహం ద్వంసంపై పవన్ కల్యాణ్ ఆగ్ర‌హం

హైదరాబాద్‌: ఈ నెల 13 ఆదివారం అర్దరాత్రి సమయంలోతెలంగాణలో జరిగిన అమ్మవారి విగ్రహ ధ్వంసంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ స్పందించారు. సికింద్రాబాద్‌ ముత్యాలమ్మ విగ్రహ ధ్వంసం దుర్మార్గం అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అమ్మవారి విగ్రహం కూల్చడం తనను కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది మహాపచారం అని అన్నారు.

గత ఐదేళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆలయాలను ఇలా అపవిత్రం చేయడం చూశానని జ‌న‌సేనాని పేర్కొన్నారు. ఇటీవ‌లి కాలంలో బంగ్లాదేశ్‌లో హిందూ దేవాల‌యాల‌ను అప‌వ్రితం చేయ‌డం అల‌వాటుగా మారింది. ఇటువంటి దుర్మార్గాలపై చాలా బలమైన చర్యలు అవసరమన్నారు.

అందుకే తిరుపతిలో జరిగిన వారాహి డిక్లరేషన్ సభలో చెప్పానని ప‌వ‌న్ పేర్కొన్నారు. ఇటువంటి అకృత్యాలు పునరావృతం కాకుండా ప్రజలంతా అప్రమత్తంగా ఉండవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ మేర‌కు జ‌న‌సేనాని సోష‌ల్ మీడియా వేదిక‌గా ఒక లేఖ‌ను విడుద‌ల చేశారు.

కాగా, సికింద్రాబాద్‌ కుమ్మరిగూడలో ముత్యాలమ్మ విగ్రహాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. విగ్రహం కూల్చివేయడం తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారానికి దారితీసింది. హిందూత్వ సంఘాలు ఈ సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఇప్పటికే ఈ సంఘటనలో కొందరిని అదుపులోకి తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.

Related Posts
ఇకపై వారికి నెలకు 2 లక్షల జీతం: ఏపీ ప్రభుత్వం
Salary of Rs 2 lakh per month for cabinet rank holders - AP Govt

అమరావతి: ఏపీలోని కూటమి ప్రభుత్వం వరుసగా కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ క్రమంలోనే కేబినెట్ హోదా ఉన్నవారికి నెలకు రెండు లక్షల జీతం అందించేందుకు చంద్రబాబు కూటమి Read more

విరాట్‌కి ఏమైంది అస్సలు..
virat kohli

ఇటీవల కొన్ని ఘటనలపై క్రికెట్ అభిమానులు విరాట్ కోహ్లీని విమర్శిస్తున్నారు. అందులో ముఖ్యంగా, మెల్‌బోర్న్ టెస్టులో తన యౌవనంతో సగం వయసున్న ఆటగాడిని ఉద్దేశపూర్వకంగా ఔట్ చేయడాన్ని Read more

SSMB 29 మహేష్ బాబుకి ఇన్ని నిబంధనల!
SSMB 29 మహేష్ బాబుకి ఇన్ని నిబంధనల!

SSMB 29: ప్రేక్షకులు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న కాంబినేషన్ - S.S రాజమౌళి మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక చిత్రంలో కలిసి పనిచేస్తున్నారు. Read more

నేడు నాంపల్లి కోర్టు ముందు హాజరుకానున్న నాగార్జున
Defamation suit against Konda Surekha. Nagarjuna to appear in court tomorrow

నేడు నాంపల్లి కోర్టు ముందు హాజరుకానున్న నాగార్జున హాజరుకాబోతున్నారు. ఇటీవల మంత్రి కొండా సురేఖ నాగార్జున తో పాటు ఆయన మాజీ కోడలు పై చేసిన వ్యాఖ్యలకు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *