పవన్ కళ్యాణ్ కాకినాడ టూర్ షెడ్యూల్ ..

Seats were sent keeping in mind the future of the state: Pawan

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జూలై 1వ తేదీ నుంచి కాకినాడ జిల్లాలో మూడు రోజులు పర్యటించబోతున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా.. జూలై 1వ తేదీ (రేపు) ఉదయం విమానంలో హైదరాబాద్ నుండి రాజమండ్రికి చేరుకుంటారు. రోడ్డు మార్గంలో గొల్లప్రోలు మండలం గొల్లప్రోలులో సత్య కృష్ణ కన్వెన్షన్ హల్ లో పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు.

అనంతరం చేబ్రోలు నివాసానికి చేరుకుని పిఠాపురం నాయకులతో, వీర మహిళలతో, స్థానిక ముఖ్య నాయకులతో సమీక్ష సమావేశంలో పాల్గొంటారు. 2వ తేదీన కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలనుండి 11:30 వరకు పంచాయతీ శాఖ అధికారులతో, 11:30 నుండి 12:30 వరకు జల వనరుల శాఖ అధికారులతో, 12:30 నుండి 1:30 వరకు అటవీ శాఖ అధికారులతో, 1.30 నుండి 2 గంటల వరకు రహదారుల పరిస్థితి పై పవన్ కల్యాణ్ సమీక్షలు నిర్వహించనున్నారు. అనంతరం చేబ్రోలు నివాసానికి చేరుకుని జనసేన ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమావేశం అవుతారు.

మూడోరోజు (జూలై 3వ తేదీ) ఉదయం 10 గంటలకు రోడ్డు మార్గంలో ఉప్పాడ సముద్ర తీర ప్రాంతంలో కోతకు గురవుతున్న ప్రాంతాన్ని పరిశీలిస్తారు. మధ్యాహ్నం పిఠాపురం నియోజకవర్గంలోని అధికారులతో పరిచయ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం టీడీపీ, బీజేపీ నాయకులతో సమావేశం అవుతారు. పిఠాపురం నియోజవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు పిఠాపురంలో సాయంత్రం నాలుగు గంటలకు వారాహి బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. బహిరంగ సభ అనంతరం అక్కడి నుండి విజయవాడ బయలుదేరి వెళ్తారు.