pawan lokesh

పవన్, లోకేశ్ పర్యటనలు రద్దు

బుధువారం తిరుపతి లో జరిగిన తొక్కిసలాట ఘటన నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటు మంత్రి నారా లోకేష్ ల పర్యటన లు రద్దు అయ్యాయి. ఈరోజు పవన్ కళ్యాణ్ కర్నూలు జిల్లా పర్యటన కు వెళ్లాల్సి ఉండగా దానిని రద్దు చేసుకున్నారు. ఈ పర్యటనలో ఆయన గ్రీన్ కో రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టును పరిశీలించాల్సి ఉంది. అయితే ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ పర్యటనను తాత్కాలికంగా రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

తిరుమల ఘటన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చర్చల కారణంగా పవన్ కళ్యాణ్ పర్యటనను రద్దు చేసినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఈ ప్రాజెక్టు పరిశీలన కార్యక్రమం పవన్ కళ్యాణ్ పర్యటనలో ప్రధాన కార్యక్రమంగా ఉండేది. ప్రజల సమస్యలు, ప్రస్తుత పరిస్థితులపై దృష్టి పెట్టే అవసరం ఉందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అటు మంత్రి నారా లోకేశ్ కూడా తన కర్నూలు పర్యటనను రద్దు చేసుకున్నారు. లోకేశ్ ఇవాళ కర్నూలు జిల్లాలో పలు కళాశాలలను సందర్శించాల్సి ఉంది. అదేవిధంగా మంత్రి భరత్ కుమార్తె వివాహ రిసెప్షన్ వేడుకల్లో పాల్గొనాల్సి ఉన్నప్పటికీ, అనివార్య కారణాల వల్ల ఈ పర్యటన రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ రెండు పర్యటనల రద్దు ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రభావం చూపించినప్పటికీ, తిరుమల ఘటన అనంతర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ప్రజలు ఈ నిర్ణయాన్ని అర్థం చేసుకుంటారని అధికార ప్రతినిధులు తెలిపారు.

Related Posts
తప్పుడు ప్రచారాలను నమ్మవద్దు: గిరిజ‌నుల‌కు సీఎం సూచ‌న‌
Don't believe false propaganda.. CM advises tribals

గిరిజన హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామంటూ చంద్ర‌బాబు ట్వీట్‌ అమరావతి: గిరిజన ప్రాంతాల్లో 1/70 చట్టాన్ని తొలగించే ఉద్దేశం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. వారి Read more

ఆర్జీ కర్ తీర్పుపై అసంతృప్తి: మమతా బెనర్జీ
ఆర్జీ కర్ తీర్పుపై అసంతృప్తి మమతా బెనర్జీ1

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆర్జీ కార్ కేసులో మరణశిక్ష పొందడం కుదరలేదన్న విషయం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. కోల్‌కతాలో ఈ కేసును సిబిఐకు Read more

మహా కుంభమేళాలో విజయ్ దేవరకొండ
మహా కుంభమేళాలో విజయ్ దేవరకొండ

నటుడు విజయ్ దేవరకొండ తన తల్లి మాధవి దేవరకొండతో కలిసి మహా కుంభమేళాలో పాల్గొన్నారు. పవిత్ర జలాల్లో స్నానం చేసి, ప్రత్యేక ప్రార్థనలు చేసిన విజయ్ దేవరకొండ Read more

ఫెంగల్ సైక్లోన్: పుదుచ్చేరి, తమిళనాడులో రెడ్ అలర్ట్
fengal cyclone

సైక్లోన్ ఫెంగల్ ఈ శనివారం మధ్యాహ్నం పుదుచ్చేరి సమీప తీర ప్రాంతాలను తాకే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇది క్రమంగా వేగం పెరిగినపుడు, ఈ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *