Pavan to launch 'Adavi Thalli Bata' from today

Pawan Kalyan : నేటి నుంచి ‘అడవితల్లి బాట’ప్రారంభించనున్న పవన్

Pawan Kalyan : ఏపీ ప్రభుత్వం గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోంది. ఈ మేరకు ‘అడవి తల్లి బాట’ పేరుతో గిరిజన గ్రామాల్లో పూర్తిస్థాయిలో రోడ్ల అభివృద్ధికి డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో అడుగులు పడనున్నాయి. ఈ నేపథ్యంలో గిరిజన గ్రామాల్లో రెండు రోజులపాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లాలో రెండు రోజులపాటు డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఈరోజు (7వ తేదీ) ఉదయం విశాఖపట్నం విమానాశ్రయం నుంచి నేరుగా అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగూడ మండలం పెదపాడు గ్రామంలోని గిరిజన ఆవాసాలను సందర్శించనున్నారు.

Advertisements
నేటి నుంచి ‘అడవితల్లి బాట’

రోడ్ల నిర్మాణానికి పవన్ కళ్యాణ్ శంకుస్థాపన

అడవి తల్లి బాట పేరిట చేపట్టే రోడ్ల నిర్మాణానికి పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేయనున్నారు. అక్కడే బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. 8వ తేదీ ఉదయం అరకు మండలం, సుంకరమిట్టలో పర్యటించనున్నారు. అక్కడ నిర్మించిన ఉడెన్ బ్రిడ్జి ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. తర్వాత అక్కడి నుంచి విశాఖపట్నం ఇందిరాగాంధీ జూలాజికల్ పార్కుకు పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. అక్కడ ఎకో టూరిజంపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధి, ఎకో టూరిజంకు ఉన్న అవకాశాలపై చర్చించనున్నారు. గిరిజన గ్రామాల మధ్య అనుసంధాన రోడ్ల అభివృద్ధి, రాష్ట్రంలో ఎకో టూరిజం ప్రోత్సాహంపై పవన్ కళ్యాణ్ ప్రధాన దృష్టిసారించనున్నారు.

Related Posts
దసరాకి ‘గేమ్ ఛేంజర్’ టీజర్ – తమన్
game changer jpg

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ కు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కిక్కిచ్చే న్యూస్ చెప్పారు. డైరెక్టర్ శంకర్ (Shankar) - మెగా పవర్ స్టార్ రామ్ Read more

కాంగ్రెస్‌కు రంజాన్ గిఫ్టు ఇదే – బండి సంజయ్
bandi sanjay revant

తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు రెండు కీలక స్థానాల్లో విజయం సాధించడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ముఖ్యంగా కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ Read more

తిరుమల కొండపై అక్రమ నిర్మాణాలపై హైకోర్టు ఆగ్రహం
తిరుమల కొండపై అక్రమ నిర్మాణాలపై హైకోర్టు ఆగ్రహం

తిరుమలలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన మఠాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. తిరుమలలో Read more

డొనాల్డ్ ట్రంప్ టారిఫ్స్ ద్వారా అమెరికాలో ధరలు పెరిగే అవకాశం
trump 3

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలో అన్ని సమస్యల పరిష్కారంగా టారిఫ్స్ ని ప్రస్తావించారు. అయితే, ఆర్థికవేత్తలు ఈ టారిఫ్స్ వల్ల సాధారణ అమెరికన్ Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×