నాలుగోరోజు ప్రారంభమైన పార్లమెంట్‌ సమావేశాలు

Parliament session started on the fourth day

న్యూఢిల్లీ: వరుసగా నాలుగో రోజు పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. సమావేశాలు ప్రారంభానికి ముందు లోక్‌సభ మాజీ స్పీకర్‌ సోమనాథ్‌ ఛటర్జీ జయంతి సందర్భంగా నేతలు నివాళులర్పించారు. లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌, ఇతర నేతలు పార్లమెంట్‌లోని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

అనంతరం ఉదయం 11 గంటలకు ఉభయ సభలు ప్రారంభం అయ్యాయి. సమావేశాలు ప్రారంభం కాగానే ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి నేతలు ఆందోళన చేపట్టారు. మంగళవారం ఉభయసభల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024-25 బడ్జెట్‌కు వ్యతిరేకంగా ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఉభయసభల్లో గందరగోళం నెలకొంది. సభ్యుల గందరగోళం మధ్యే సమావేశాలు కొనసాగుతున్నాయి.