budget 2025

రేపటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రేపు (శుక్రవారం) ప్రారంభం కానున్నాయి. 1వ తేదీన కేంద్ర ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 వార్షిక బడ్జెట్ ను ప్రతిపాదించనున్నారు. సమావేశాల పై అఖిలపక్ష సమావేశం నిర్వహించిన కేంద్రం ప్రభుత్వ బిజినెస్ గురించి స్పష్టత ఇచ్చింది. వక్ఫ్ బిల్లుతో పాటుగా 16 బిల్లులను సమావేశాల్లో ప్రవేశ పెడుతున్నట్లు వెల్లడించింది. టీడీపీ, వైసీపీ ఏపీ అంశాల పైన సమావేశంలో ప్రస్తావించారు. అఖిలపక్ష భేటీలో పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో పలు కీలక బిల్లులు ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. బడ్జెట్‌ సమావేశాలపై గురువారం పార్లమెంట్‌ ఆవరణలో స్పీకర్‌ ఓం బిర్లా అధ్యక్షతన ఆల్‌ పార్టీ మీటింగ్‌ నిర్వహించారు. స్పీకర్‌ ఓం బిర్లాకు వక్ఫ్‌ సవరణ బిల్లుపై ఏర్పాటు చేసిన జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ నివేదిక అందజేసింది. జేపీసీ చైర్మన్‌ జగదాంబికా పాల్‌ ఆధ్వర్యంలో ఎంపీలు స్పీకర్‌ను కలిసి నివేదిక సమర్పించారు. పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు సజావుగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని స్పీకర్‌ అభ్యర్దించారు.

సభ ముందుకు కీలక బిల్లులు ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 వార్షిక బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశ పెట్టనున్నారు. వక్ఫ్ బిల్లుతో పాటుగా కీలకమైన అక్రమ వలసదారుల నియంత్రణకు సంబంధించిన ద ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ ఫారినర్స్‌ బిల్‌ను ప్రస్తుత సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు రంగం సిద్దమైంది.

ప్రతిపక్షాల హామీ పార్లమెంటు సజావుగా సాగేందుకు సహకరించేందుకు సిద్దమని ప్రతిపక్ష పార్టీలు హామీ ఇచ్చాయి. ఆర్థిక మందగమనం, ధరల పెరుగుదల, నిరుద్యోగం వంటి అనేక సమస్యలను పార్లమెంటులో లేవనెత్తుతామని ప్రతిపక్ష నేతలు చెప్పుకొచ్చారు. తొలి విడత సమావేశాలు జనవరి 31న ప్రారంభ మై ఏప్రిల్‌ 4న ముగియనున్నాయి. మార్చి 10న ఉభయసభలు తిరిగి ప్రారంభమవుతాయి.

Related Posts
‘ఆర్గానిక్ క్రీమరీ బై ఐస్‌బర్గ్’ ప్రారంభం
Organic Creamery by Iceberg

'Organic Creamery by Iceberg' హైదరాబాద్‌: భారతదేశపు మొట్టమొదటి ఆర్గానిక్ ఐస్ క్రీం బ్రాండ్ అయిన ఐస్‌బర్గ్ విస్తరణ దిశలో ఉంది. ప్రీమియం బ్రాండ్ 'ఆర్గానిక్ క్రీమరీ Read more

హైదరాబాద్‌ చేరుకున్న ఏఐసీసీ కార్యదర్శి మీనాక్షి నటరాజన్
AICC Secretary Meenakshi Natarajan reached Hyderabad

మధ్యాహ్నం 2 గంటలకు పీసీసీ విస్తృత స్థాయి సమావేశం హైదరాబాద్‌: ఇటీవల తెలంగాణ కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిగా నియమితులైన మీనాక్షి నటరాజన్‌ రాష్ట్రానికి వచ్చారు. సాదాసీదాగా Read more

అమెరికా ఎన్నికలు..కాంగ్రెస్‌కు తొలి ట్రాన్స్‌జెండర్‌
US elections.First transgender for Congress

వాషింగ్టన్‌: అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విజయం దిశగా సాగిపోతున్నారు. మరికాసేపట్లో స్పష్టమైన ఫలితాలతో గెలుపు ఎవరిని వరిస్తుందో తెలియనుంది. ఈ Read more

ఫ్యాక్ట‌రీలో భారీ పేలుడు.. ఐదుగురు మృతి
Massive explosion in Ordnance Factory.. Five people died.

ముంబయి : మ‌హారాష్ట్ర‌లోని భండారా జిల్లాలో ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. నాగ‌పూర్‌కు స‌మీపంలో ఉన్న ఓ ఆర్డినెన్స్ ఫ్యాక్ట‌రీలో భారీ పేలుడు సంభ‌వించింది. పేలుడు ధాటికి ఆర్డినెన్స్ Read more