ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు

ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరింది..సీఎం గా చంద్రబాబు బాధ్యతలు చేపట్టారు. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన 24 మందికి శాఖలు కేటాయించడం జరిగింది. అలాగే రాష్ట్రంలో ముఖ్య పార్టీ నేతలకు కీలక పదవులు అప్పగిస్తున్నారు చంద్రబాబు. తాజాగా ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావును నియమించారు. ప్రస్తుతం ఆ పదవిలో ఉన్న కింజరాపు అచ్చెన్నాయుడుకు మంత్రిగా అవకాశం కల్పించారు.

ఈ నేపథ్యంలో బీసీ-యాదవ వర్గానికి చెందిన పల్లా పేరును రాష్ట్ర అధ్యక్ష పదవికి టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. ఇటీవల జరిగిన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి గుడివాడ అమర్‌నాథ్‌పై భారీ మెజార్టీతో పల్లా శ్రీనివాసరావు గెలుపొందారు. రాష్ట్రంలో అత్యధికంగా 95,235 ఓట్ల తేడాతో పల్లా గెలుపొందారు. ఈ నేపథ్యంలో బీసీ-యాదవ వర్గానికి చెందిన పల్లాను చంద్రబాబు ఎంపిక చేశారు. పల్లా శ్రీనివాసరావును నియమించడంతో టీడీపీ కేడర్ అభినందనలు చెబుతున్నారు.