Pakistan rules out bilateral talks with India during Jaishankars visit

షాంఘై సదస్సు.. భారత్‌తో ద్వైపాక్షిక చర్చలు ఉండవ్ : పాకిస్తాన్

న్యూఢిల్లీ : ఇస్లామాబాద్ వేదికగా అక్టోబర్ 15-16 మధ్య షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీవో) శిఖరాగ్ర సదస్సు జరగనున్న నేపథ్యంలో ఆతిథ్య దేశం పాకిస్థాన్ కీలక ప్రకటన చేసింది. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌ పాక్ పర్యటన సందర్భంగా భారత్‌తో ద్వైపాక్షిక అంశాలపై చర్చలు ఉండబోవని స్పష్టం చేసింది. చర్చలకు అవకాశం లేదని తెలిపింది. ఈ మేరకు పాకిస్థాన్ విదేశాంగ కార్యాలయ ప్రతినిధి ముంతాజ్ జహ్రా బలోచ్ ఒక ప్రకటన విడుదల చేశారు.

జైశంకర్ పర్యటన, భారత్-పాకిస్థాన్ సంబంధాలపై మీడియా ప్రశ్నించగా ఆయన ఈ సమాధానం ఇచ్చారు. ‘‘భారత బృందం పర్యటనకు సంబంధించి పాకిస్థాన్ స్పష్టమైన విధానంతో ఉంది. సభ్యులందరినీ స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నాం. ఇక భారత్‌తో ద్వైపాక్షిక సమావేశాలకు సంబంధించిన మీ ప్రశ్నకు అక్టోబర్ 5న భారత విదేశాంగ మంత్రి జైశంకర్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించాలనుకుంటున్నాను. నా పర్యటన పాక్షిక కార్యక్రమమని జైశంకర్ చెప్పారు. పాకిస్థాన్‌తో చర్చల కోసం కాదన్నారు. ఈ వ్యాఖ్యలు వివరణాత్మకమైనవి’’ అని ముంతాజ్ జహ్రా బలోచ్ ప్రస్తావించారు.

కాగా, ఇస్లామాబాద్‌లో జరిగే ఎస్‌సీవో సదస్సులో పాల్గొనేందుకు వెళ్లనున్న భారత బృందానికి విదేశాంగమంత్రి జైశంకర్ నేతృత్వం వహిస్తారని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది.

Related Posts
మూసీ కూల్చివేతల్లో కూడా ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సిందే – ఈటెల
etela musi

తెలంగాణలో మూసీ కూల్చివేతల అంశంపై బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నాయకత్వంలో ముందడుగు వేస్తామని ఎంపీ ఈటల రాజేందర్ ప్రకటించారు. హైదరాబాద్‌లో Read more

సంక్రాంతికి రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’..?
game changer jpg

మెగా అభిమానులను మరోసారి నిరాశ పరచబోతుంది గేమ్ ఛేంజర్ టీం. ఇప్పటికే ప్రమోషన్ విషయంలో నిరాశ పరుస్తూ వస్తుండగా…ఇక ఇప్పుడు రిలీజ్ విషయంలో కూడా పెద్ద షాక్ Read more

52 ఏళ్ల మహిళ సముద్రంలో 150 కిమీ ఈత!
52 ఏళ్ల మహిళ సముద్రంలో 150 కిమీ ఈత!

ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలోని సూర్యరావుపేట తీరంలో 52 ఏళ్ల గోలి శ్యామల విశాఖపట్నం నుండి 150 కిలోమీటర్ల కఠినమైన ఈత కొట్టిన తరువాత సముద్రం నుండి బయటికి రావడంతో Read more

మళ్లీ వార్తల్లోకి మాజీ ఎంపీ కేశినేని నాని
Kesineni Nani is busy in po

గత ఎన్నికల అనంతరం రాజకీయాలకు దూరంగా ఉన్న విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని మళ్లీ తెరపైకి వచ్చారు. 2024 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *