Over 500 Indians released from UAE prisons

UAE: క్షమాభిక్ష..యూఏఈ జైళ్ల నుంచి 500 మందికి పైగా భారతీయులు విడుదల!

UAE: భారత్‌తో సత్సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే క్రమంలో యూఏఈ అనూహ్య నిర్ణయం తీసుకుంది. పవిత్ర రంజాన్‌ మాసం సందర్భంగా భారీ సంఖ్యలో ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించింది. అందులో భారత్‌కు చెందిన వాళ్లే 500 మందికి పైగా ఉండగా.. వాళ్లంతా జైళ్ల నుంచి విడుదలైనట్లు సమాచారం. ఈ చర్య భారత్‌- యూఏఈల మధ్య బలమైన సంబంధాలను తెలియజేస్తోంది.

Advertisements
యూఏఈ  జైళ్ల నుంచి 500 మందికి

దుబాయ్‌లోని జైళ్లలో మగ్గుతున్న వివిధ దేశాలకు చెందిన ఖైదీ

రంజాన్‌ సందర్భంగా యూఏఈ అధ్యక్షుడు షేక్‌ మహ్మద్‌ బిన్‌ జాయేద్‌ అల్‌ నహ్యాన్‌ అక్కడి జైళ్లలో ఉన్న 1,295 మంది ఖైదీలను విడుదల చేయాలని ఆదేశించారు. మరోవైపు ప్రధాని షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తూమ్‌ కూడా 1,518 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దుబాయ్‌లోని జైళ్లలో మగ్గుతున్న వివిధ దేశాలకు చెందిన ఖైదీలకు తాజా క్షమాభిక్ష వర్తిస్తుందని అటార్నీ జనరల్‌, ఛాన్సలర్‌ ఎస్సమ్‌ ఇస్సా అల్‌ హుమైదాన్‌ ప్రకటించారు.

ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించడం యూఏఈలో ఆనవాయితీ

రంజాన్‌ మాసం సందర్భంగా ఇలా ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించడం.. విడుదల చేయడం యూఏఈలో ఆనవాయితీగా వస్తోంది. అయితే సత్ప్రవర్తనను ఆధారంగా చేసుకునే ఆయా ఖైదీలను ఎంపిక చేసి విడుదల చేస్తుంటారు. అంతేకాదు వాళ్లు జనజీవన స్రవంతిలో కలిసిపోయేందుకు అవసరమయ్యే ఆర్థిక సాయం కూడా అందించనున్నారు. కాగా, యూఏఈలో మరణశిక్షలు పడిన భారతీయులు 25 మంది ఉన్నారని, వారిపై కోర్టు తీర్పులు ఇంకా అమలుకాలేదని విదేశీ వ్యవహారాలశాఖ సహాయమంత్రి కీర్తి వర్థన్‌సింగ్‌ ఇటీవల రాజ్యసభలో తెలిపారు.

Related Posts
‘బలగం’ మూవీ మొగిలయ్య మృతి
balagam mogilaiah died

జానపద కళాకారుడు, 'బలగం' సినిమా ద్వారా ప్రత్యేక గుర్తింపు పొందిన మొగిలయ్య (67) ఈ ఉదయం కన్నుమూశారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన కొంతకాలంగా చికిత్స Read more

సైనిక విమానాల్లో భారతీయులను వెనక్కి పంపుతున్న ట్రంప్
దేశం వీడని అక్రమ వలసదారులకు రోజువారీగా జరిమానాలకు ట్రంప్ సిద్ధం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏ నిర్ణయం తీసుకున్నా అది సంచలనంగానే ఉంటుంది. ఎన్నికల సమయంలో అమెరికన్లకు మాటిచ్చినట్లుగానే ప్రస్తుతం అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. దేశంలో Read more

IPL: SRH చెత్త రికార్డ్
srh team

సన్‌రైజర్స్ హైదరాబాద్‌ (SRH) జట్టు ఈ సీజన్‌లో బయటి పిచ్లపై విజయం అందుకోలేని చెత్త రికార్డును కొనసాగిస్తోంది. తాజాగా ముంబై ఇండియన్స్‌తో వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో Read more

లోక్‌సభ లో జమిలి ఎన్నికల బిల్లు
WhatsApp Image 2024 12 17 at 1.06.13 PM (1)

ఎంతో కాలంగా బీజేపీ పట్టుదలతో జమిలి ఎన్నికల కోసం కసరత్తు చేస్తున్న విషయం తెలిసేందే. ఒకే దేశం-ఒకే ఎన్నిక లక్ష్యంతో దేశమంతా ఒకేసారి నిర్వహించేందుకు రూపొందించిన బిల్లు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×