Over 100 flights delayed due to heavy fog

కమ్మేసిన పొగమంచు.. 100కు పైగా విమానాలు ఆలస్యం

న్యూఢిల్లీ: చలి తీవ్రతకు ఉత్తరభారతం వణుకుతోంది. దేశ రాజధాని ఢిల్లీ సహా యూపీ, పంజాబ్‌, జార్ఖండ్‌, పశ్చిమబెంగాల్‌ సహా పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలి తీవ్రత పెరిగింది. ఆయా ప్రాంతాలను దట్టమైన పొగ కమ్మేసింది. ఢిల్లీ – ఎన్సీఆర్‌ ప్రాంతాన్ని దట్టంగా పొగ కమ్మేసింది. దీంతో విజిబిలిటీ దారుణంగా పడిపోయింది. ఈ కారణంగా ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించని పరిస్థితి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు ఉదయం ఢిల్లీ ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌లో విజిబిలిటీ జీరోకు పడిపోయినట్లు అధికారులు తెలిపారు.

image
image

దృశ్యమానత పడిపోవడంతో ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో వందకుపైగా విమానాలు ఆలస్యమయ్యాయి. కొన్ని విమానాలు రద్దు కాగా, మరికొన్ని క్యాన్సల్‌ అయ్యాయి. ఇక కోల్‌కతా విమానాశ్రయానికి రాకపోకలు సాగించే 12 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నట్లు ఎయిర్ ట్రాఫిక్ మానిటరింగ్ ప్లాట్‌ఫామ్ ఫ్లైట్‌రాడార్ తెలిపింది.

Related Posts
చంద్రబాబు అవగాహనారాహిత్యం వల్లే పోలవరం ప్రాజెక్టు ఆలస్యం – అంబటి
ambati polavaram

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం అవ్వడానికి చంద్రబాబు నాయుడి అవగాహనారాహిత్యమే కారణమని మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజాధనాన్ని వృథా చేస్తూ తీసుకున్న Read more

Donald Trump: మోడీ వస్తున్నారు వీధులను శుభ్రంగా వుంచండి: ట్రంప్‌ ఆదేశాలు
మోడీ వస్తున్నారు వీధులను శుభ్రంగా వుంచండి: ట్రంప్‌ ఆదేశాలు

మోడీ అమెరికా పర్యటనకు వస్తున్నారని, ఆయనతో పాటు మరికొంతమంది దేశాధ్యక్షులు కూడా వస్తారని, వాళ్లు వచ్చిన సమయంలో వాషింగ్టన్‌ డీసీ సుందరంగా మారిపోవాలని, నగరంలో టెంట్లు, గోడలపై Read more

మైనారిటీల బడ్జెట్ ను ఇతర పథకాలకై దారిమళ్లించ కూడదు
minority

మైనారిటీల బడ్జెట్ ను ఇతర పథకాలకై దారిమళ్లించ కూడదు జాతీయ మైనారిటీ కమిషన్ సభ్యులు సయ్యద్ షాహెజాది అమరావతి, డిశంబరు 10: మైనారిటీల బడ్జెట్ ను మైనారిటీల Read more

2026 ఎన్నికల్లో సింగిల్ గానే బరిలోకి – మమతా బెనర్జీ
2026 elections as a single

2026 ఎన్నికల్లో సింగిల్ గానే బరిలోకి . పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధినేత్రి మమతా బెనర్జీ 2026 అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ Read more