ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి వసీం ఆత్మహత్య..ప్రభుత్వమే కారణం – కేటీఆర్

సరిగ్గా జీతాలు రాక, కుటుంబ సమస్యలతో సూర్యాపేట GOVT ఆస్పత్రిలో పనిచేస్తున్న వసీమ్ ఆత్మహత్య చేసుకున్నారు. తనను క్షమించాలంటూ భార్యకు రాసిన సూసైడ్ లెటర్ కన్నీళ్లు పెట్టిస్తోంది. ‘డియర్ రజనీ. నిన్ను చాలా బాధపెట్టా. మనకు ఎవరూ లేరు. పిల్లలు అలా కాకూడదని చాలా ఊహలు కన్నా. కానీ ఏదీ కుదరలేదు. వచ్చే జన్మలో నా పిల్లలకే కొడుకుగా పుడతా’ అని రాశారు. తాను కొందరి వద్ద చేసిన అప్పును చెల్లించాలని భార్యను కోరారు.

ఈ ఘటన ఫై కేటీఆర్ స్పందించారు. ప్రభుత్వ ఉద్యోగులందరికీ ప్రతి నెలా ఒకటో తేదీనే జీతాలిస్తున్నట్లు కాంగ్రెస్ నేతలు చెబుతున్న మాటలన్నీ అవాస్తవాలని కేటీఆర్ విమర్శించారు. సూర్యాపేట ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేస్తున్న వసీమ్ అనే ఉద్యోగి 3 నెలలుగా జీతాలు రాక మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడని Xలో పోస్టు చేశారు. అతని మరణానికి బాధ్యులెవరు? అని ప్రశ్నించారు ప్రతి నెల ఒకటో తేదీననే ఉద్యోగులకు జీతాలిస్తున్నట్లు ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నది. అది పచ్చి అబద్ధమని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యానికి వసీం ఆత్మహత్యే ఉదాహరణ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. అతని ఆత్మహత్యకు కారణమెవరని నిలదీశారు.