ఆన్‌లైన్ జూదానికి బలైన ముగ్గురు

ఆన్‌లైన్ జూదానికి బలైన ముగ్గురు

ఆన్‌లైన్ బెట్టింగ్‌ ఈ మధ్యకాలంలో ఎంతో మందిని కబళిస్తున్న ఒక ప్రమాదకర వ్యసనం. ప్రస్తుత డిజిటల్‌ యుగంలో స్మార్ట్‌ఫోన్, ఇంటర్నెట్‌ అందుబాటులోకి రావడంతో, ఆన్‌లైన్ బెట్టింగ్‌ యాప్స్, వెబ్‌సైట్లు వేగంగా ప్రాచుర్యం పొందాయి. ఈ యాప్స్‌ తొలుత ఆకర్షణీయమైన ఆఫర్లు, బోనస్‌లతో వినియోగదారులను తమ వలలోకి దింపుకుంటాయి. చిన్న మొత్తాలతో ప్రారంభించిన వారు, కొద్దిసార్లు గెలిస్తే మరింత ఆశపడి భారీగా పెట్టుబడులు పెట్టడం ప్రారంభిస్తారు. కానీ, అనూహ్యంగా ఓటమి చెందుతారు. అప్పుడు ఆ నష్టాన్ని తిరిగి పూరించుకోవాలని అప్పులు చేసి మరీ బెట్టింగ్‌ కొనసాగిస్తారు.ఒక్కోసారి లక్షల రూపాయలు పోగొట్టుకుని తీవ్ర ఆర్థిక ఒత్తిడికి గురవుతారు. పైగా అప్పులు చేసినవాళ్లు వడ్డీ దారులు వేధిస్తే, ఆత్మహత్యలు చేసుకునే స్థితికి చేరిపోతున్నారు. ముఖ్యంగా యువత ఈ బెట్టింగ్‌ మాయాజాలంలో చిక్కుకొని భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. ఆన్‌లైన్ బెట్టింగ్‌ సైట్లు బహిరంగంగా సోషల్ మీడియా ద్వారా ప్రకటనలు ఇస్తూ, అమాయకుల్ని మోసగిస్తున్నాయి.ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా, ఈ బెట్టింగ్‌ మూలాలు మాత్రం అంతుచిక్కడంలేదు. ఈ బ్లాక్‌ మార్కెట్‌ వ్యాపారం ఎన్నో కుటుంబాలను తలకిందులు చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండి, ఆన్‌లైన్ బెట్టింగ్‌ మాయాజాలంలో పడకుండా జాగ్రత్తపడాలి. చిన్న నష్టమే పెద్ద బాదలు తెచ్చిపెట్టొచ్చు. ఒక్కోసారి, తిరిగి లేని నష్టానికి కారణమవచ్చు. కాబట్టి, ఆన్‌లైన్ బెట్టింగ్‌కు దూరంగా ఉండటం మంచిది.

1661318651 159

ఒక‌రి పేరు మీద మ‌రొక‌రు అప్పుల మీద అప్పులు చేసి,ఆ డబ్బునంతా ఆన్‌లైన్ బెట్టింగ్ లో పెట్టి, ఉన్న‌దంతా కోల్పోయిన ఆ ముగ్గురు అవి తీర్చే మార్గం క‌నిపించ‌క‌పోవ‌డంతో ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డారు. క‌ర్ణాట‌క‌లోని మైసూరు స‌మీపంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. హాంచా గ్రామ‌నికి చెందిన జోశి ఆంథోనీ ఇంట్లో ఉరివేసుకొని ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. త‌న పేరు, త‌న సోద‌రి పేరు చెప్పి,సోద‌రుడు జోబి ఆంథోనీ, మ‌ర‌ద‌లు ష‌ర్మిల ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా అప్పులు చేశార‌ని.రూ.80 ల‌క్ష‌ల దాకా అప్పులు పేరుకుపోయాయ‌ని.. దీనికి రోజుకు రూ.2.5 ల‌క్ష‌ల వ‌డ్డీ క‌ట్టాల్సి వ‌స్తోంద‌ని అంత‌కుముందు సెల్ఫీ వీడియోలో ఆయన వాపోయాడు. ఈ వీడియో బ‌య‌టికి రావ‌డంతో జోబి ఆంథోనీ, ఆయ‌న భార్య ష‌ర్మిల విజ‌య‌న‌గ‌రంలో ఉరివేసుకొని ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. ఈ ఘ‌ట‌న‌పై మైసూరు, విజ‌య‌న‌గ‌రంలో కేసులు న‌మోదయ్యాయి.  

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌

సాంకేతిక పురోగతితో ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్‌లు విస్తృతంగా విపరీతంగా ప్రజలను ఆకర్షిస్తున్నాయి. చిన్న మొత్తాలతో మొదలైన వారు పెద్ద మొత్తాలు పోగొట్టుకొని అప్పుల్లో కూరుకుపోతున్నారు. దీంతో వారు తనువు చాలించే స్థితికి చేరుకుంటున్నారు. దీంతో ప్రభుత్వాలు, పోలీసులు, సామాజిక సంస్థలు వీటిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Related Posts
బెంగళూరులో పొడవైన యూ-గర్డర్ ఆవిష్కరణ!
bengaluru

దేశంలోనే అతిపొడవైన యూ-గర్డర్ (సిమెంట్ దూలం)ను బెంగళూరులోని సబర్బన్ రైల్ కారిడార్‌లో ఉపయోగించారు. బెంగళూరు సబర్బన్ రైల్వే ప్రాజెక్టులో భాగంగా 31 మీటర్ల పొడవైన ఈ గర్డర్‌ను Read more

మ‌ణిపూర్ గ‌వ‌ర్న‌ర్‌గా అజ‌య్ కుమార్ భ‌ల్లా
ajay kumar bhalla

గత కొంతకాలంగా మణిపూర్ లో శాంతిభద్రతలు క్షిణించాయి. ఆ రాష్ట్ర సీఎంపై ప్రజలు అసంతృప్తితో వున్నారు. దీంతో ఆ రాష్ట్రముపై కేంద్రం దృష్టిని కేంద్రీకరించింది. తాజాగా కొత్త Read more

భాషను తక్కువగా అంచనా వేయొద్దు – కమల్ హాసన్
భాషను తక్కువగా అంచనా వేయొద్దు - కమల్ హాసన్

తమిళనాడులో పీఎం శ్రీ స్కూళ్ల పేరుతో హిందీని తప్పనిసరి చేయాలనే కేంద్ర ప్రభుత్వ యత్నాలకు తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సీఎం ఎంకే స్టాలిన్‌తో పాటు అన్ని రాజకీయ Read more

మహా కుంభమేళా : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరు
మహా కుంభమేళా

మహా కుంభమేళా 2025 – విశేషాలు, షెడ్యూల్ & రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము హాజరు హిందూ సంస్కృతిలో అత్యంత పవిత్రమైన మేళాలలో మహా కుంభమేళా ప్రాముఖ్యత అంతాఇంతా Read more