పాతబస్తీలో మరో హత్య..పోలీస్ వ్యవస్థ ఉందా..?

six-murdered-in-nizamabad-district

హైదరాబాద్ లో గత కొద్దీ రోజులుగా వరుస హత్యలు నగరవాసులను భయబ్రాంతులకు గురి చేస్తుంది. రెండు రోజులలో 6 హత్యలు, 2 హత్యాయత్నాలు లు జరగడం తో అసలు పోలీస్ వ్యవస్థ అనేది ఉందా..? పోలీసుల నిఘా ఏది..? వారు డ్యూటీ చేస్తున్నారా..? లేదా.? అని ప్రశ్నిస్తున్నారు. శనివారం ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మెహదీపట్నంలో మరో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. సెంటెన్స్ కళాశాల వద్ద నిర్మాణంలో ఉన్న భవనంలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పిల్లర్ నెంబర్ 19 అరవింద్ హాస్పిటల్ సమీపంలో వ్యక్తి హత్యకు గురయ్యాడు. దీంతో మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి కు తరలించారు పోలీసులు.

ఇలా వరుస హత్యలతో పాతబస్తీ వాసులు భయం వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజుల వ్యవధిలో 6 హత్యలు, 2 హత్యా యత్నాలు చోటు చేసుకున్నాయి. ఓల్డ్ సిటీలోని నవాబ్ సాబ్ కుంట అచ్చి రెడ్డి నగర్ లో ఇంట్లోకి చొరబడి మొహమ్మద్ జాకీర్ హుస్సేన్ ను హత్య చేశారు దుండగులు. అక్రమ సంబంధం కారణంగానే జాకీర్ ను హత్య చేసినట్లు గుర్తించిన పోలీసులు… షాహిన్ అనే మహిళతో పాటు భర్త హసన్ మరికొందరిని అదుపులోకి తీసుకున్నారు.