ఆసరా పెన్షన్‌ డబ్బులు తిరిగి చెల్లించాలంటూ వృద్ధురాలికి అధికారులు నోటీసులు

కాంగ్రెస్ సర్కార్ వస్తే మేలు జరుగుతుందని, పెన్షన్ పెరుగుతుందని , నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని ఇలా అనేక లాభాలు కలుగుతాయని సంబరపడ్డ రాష్ట్ర ప్రజలకు వరుస షాకులు ఇస్తుంది రేవంత్ సర్కార్. రుణమాఫీ లో ఆంక్షలు , రైతుభరోసా లో కోతలు , ఫ్రీ కరెంట్ లో చీకటి, పెన్షన్ లు ఇంకా పెంచలేదు..ఆరు నెలలు అవుతున్న పూర్తి స్థాయిలో హామీలు నెరవేర్చలేదు..ఇలా ఎన్నో ఉన్నాయి. వీటి ఫై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. ఇక ఇప్పుడు పెన్షన్ దారులకు నోటీసులుఇవ్వడం అందరిలో మరింత ఆగ్రహం నింపుతుంది.

తాజాగా ఆసరా పెన్షన్‌ డబ్బులు తిరిగి చెల్లించాలంటూ కొత్తగూడెం జిల్లా దాసరి మల్లమ్మ అనే వృద్ధురాలికి అధికారులు నోటీసులివ్వడంపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్పందించారు. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలిక ఊడినట్టుందని, కొత్తగా అనేక పథకాలు ఇస్తామని, ఉన్న సంక్షేమ పథకాలకు వచ్చే డబ్బును పెంచుతామని హామీలు ఇచ్చి గద్దెనెక్కిన రేవంత్ సర్కార్.. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న లబ్ధిదారుల నుంచి సొమ్ముని వెనక్కు రాబట్టే వింత చేష్టలు మొదలుపెట్టిందని విమర్షించారు.

ఏవో సాంకేతిక కారణాలు చూపిస్తూ వేలాది మంది ఆసరా పెన్షన్ లబ్ధిదారుల నుంచి డబ్బును ప్రభుత్వానికి వెనక్కు పంపమని నోటీసులు ఇస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దాసరి మల్లమ్మ అనే 80 ఏండ్ల ముసలమ్మకు ఆసరా పెన్షన్ కింద వచ్చిన రూ.లక్షా 72 వేలు వెనక్కు కట్టాలని నోటీసు ఇచ్చారు. ఒంటరి మహిళగా పక్షవాతంతో బాధపడుతూ ఉన్న దాసరి మల్లమ్మ వంటి వృద్ధుల నుంచి కేసీఆర్ సర్కారు ఇచ్చిన ఆసరా పెన్షన్ సొమ్మును తిరిగి లాక్కోవడానికి ప్రయత్నించడం రేవంత్ సర్కార్ అమానవీయ వైఖరికి నిదర్శనమని ట్విట్టర్ ఎక్స్‌ వేదికగా విమర్శించారు.