NVS 02 satellite that did not reach the specified orbit.

నిర్దేశిత కక్ష్యలోకి చేరని ఎన్‌వీఎస్‌-02 ఉపగ్రహం..!

న్యూఢిల్లీ: ఇస్రో గత బుధవారం చేపట్టిన 100వ ప్రయోగానికి అనుకోని అడ్డంకులు ఏర్పడ్డాయి. అంతరిక్షంలోకి పంపిన ఎన్‌వీఎస్‌-02 శాటిలైట్‌లో సాంకేతిక లోపం తలెత్తిందని ఇస్రో తాజాగా ప్రకటించింది. ‘నిర్దేశిత కక్ష్యలోకి ఎన్‌వీఎస్‌-02 నావిగేషన్‌ శాటిలైట్‌ను ప్రవేశపెట్టలేకపోయాం. కక్ష్యను పెంచేందుకు శాటిలైట్‌లోని థ్రస్టర్లను మండించే ప్రయత్నం చేయగా, ఆక్సిడైజర్లను అందించే వాల్వ్‌లు తెరుచుకోలేదు’ అని ఇస్రో వెబ్‌సైట్‌ పేర్కొన్నది.

Advertisements

యూఆర్‌ శాటిలైట్‌ సెంటర్‌లో తయారైన శాటిలైట్‌లో సాంకేతిక లోపం కారణంగా ద్రవరూప ఇంధనం మండించలేకపోయారు. దీంతో ఈ మిషన్‌ ఆలస్యం కావొచ్చు లేదా.. శాటిలైట్‌పై ఆశలు వదులుకోవచ్చునని సైంటిస్టులు భావిస్తున్నారు. జనవరి 29న శ్రీహరి కోట నుంచి జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌15 రాకెట్‌ ద్వారా ఎన్‌వీఎస్‌-02 శాటిలైట్‌ను ఇస్రో ప్రయోగించింది.

image

కాగా, ఎన్‌వీఎస్‌-02 శాటిలైట్‌లో ఉన్న ఇంజిన్లు మొరాయించడం వల్లే, దాన్ని నిర్దేశిత కక్ష్యలోకి పంపలేకపోయారని తెలిసింది. ఆ శాటిలైట్‌లోని ఇంజిన్లలోకి ఆక్సిడైజర్‌ను పంపి, వాటిని యాక్టివేట్ చేయాల్సి ఉంటుంది. ‘ఆన్’ మోడ్‌లోకి తేవాల్సి ఉంటుంది. అయితే ఆక్సిడైజర్‌ను శాటిలైట్‌లోని ఇంజిన్లలోకి చేరవేసే వాల్వ్‌లు తెరుచుకోలేదు. దీంతో ఇంజిన్లు పనిచేసే అవకాశం లేకుండాపోయింది. దీంతో ప్రస్తుతం ఎన్‌వీఎస్‌-02 ఉపగ్రహం భూఅనువర్తిత బదిలీ కక్ష్య (జీటీవో)లో పరిభ్రమిస్తోంది. ఈ కక్ష్యలో శాటిలైట్ పరిభ్రమిస్తే నేవిగేషన్‌ వ్యవస్థ కార్యకలాపాల నిర్వహణకు పనికిరాదు. శాటిలైట్ ఇంజిన్లలోకి ఆక్సిడైజర్‌ను పంపేందుకు అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయ మార్గాల కోసం ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. భారతదేశ స్వదేశీ ఉపగ్రహ ఆధారిత నేవిగేషన్‌ వ్యవస్థలో ఎన్‌వీఎస్‌-02 ఉపగ్రహం చాలా ముఖ్యమైంది.

Related Posts
Vallabaneni Vamsi: వల్లభనేని వంశీకి కోర్టు మరో షాక్
Vallabaneni Vamsi: వల్లభనేని వంశీకి కోర్టు మరో షాక్

వంశీకి మళ్లీ షాక్‌: రిమాండ్ పొడిగించిన కోర్టు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి సంబంధించి మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎస్సీ, Read more

Supreme Court: మైనర్‌పై అత్యాచారం..40 ఏళ్ల కు కామాంధుడికి శిక్ష విధించిన సుప్రీం కోర్టు
మైనర్‌పై అత్యాచారం..40 ఏళ్ల కు కామాంధుడికి శిక్ష విధించిన సుప్రీం కోర్టు

ఏదయినా అన్యాయం జరిగితే కొంతకాలం పోరాడి, న్యాయం జరగకపోతే ఇక న్యాయం జరగదని వదిలేస్తాం. కానీ ఓ కుటుంబం మాత్రం కామాంధుడికి శిక్ష పడేంతవరకు పోరాడింది. 40 Read more

విద్యకు రూ.2,506 కోట్లు.. బడ్జెట్ హైలైట్స్
బడ్జెట్లో భారీగా రాజధాని అమరావతికి కేటాయింపులు

అప్పు తీసుకొనే శక్తి లేని ఏకైక రాష్ట్రంగా ఏపీ అమరావతి: ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ శాసనసభలో 2025-26 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రూ.3.22 లక్షల Read more

Haryana: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య
Murder: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య

ఇన్‌స్టాలో ప్రేమ.. ఘోర హత్యకు దారితీసింది! హర్యానాలోని హిస్సార్ జిల్లా ప్రేమ్‌నగర్ లో ఓ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డిజిటల్ కంటెంట్ క్రియేటర్‌గా పనిచేస్తున్న Read more

×