‘ఎన్టీఆర్-నీల్’ మూవీ షూటింగ్ ఎప్పటి మొదలంటే..!

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో Jr.ఎన్టీఆర్ హీరోగా నటించబోయే సినిమా షూటింగ్ అక్టోబర్ 21 నుంచి ప్రారంభం కానుంది. ‘దేవర’ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ షెడ్యూల్లో 40 రోజులపాటు ఇతర నటీనటులతో సీన్లను షూట్ చేస్తారని, తాను 2025 జనవరి నుంచి సెట్స్ లో జాయిన్ అవుతానని పేర్కొన్నారు.

ఇక దేవర విషయానికి వస్తే.. ఈ సినిమా విడుదలకు మరో వారం రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికే యూఎస్ లో బుకింగ్స్ ఓపెన్ చేసారు. అక్కడ దేవర్ టికెట్స్ కు మంచి క్రేజ్తో అమ్ముడైపోతున్నాయి. ఇప్పటికే అక్కడ ప్రీ బుకింగ్స్ ద్వారా $2 మిలియన్ యూఎస్ డాలర్స్ కలెక్ట్ చేసి ఔరా అనిపించింది. మరోవైపు అభిమానులు ఈ సినిమా టికెట్స్ కోసం బుక్ మై షో ఓపెన్ చేస్తే దెబ్బకు క్రాష్ అయిపోయింది.