తెలంగాణాలో కాంగ్రెస్ గెలుపుకి ఎన్నారైల కృషి చాలా ఉంది: సీఎం రేవంత్‌ రెడ్డి

NRI’s efforts for Congress victory in Telangana are a lot: CM Revanth Reddy

న్యూజెర్సీ : అమెరికా వెళ్లిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. న్యూ జెర్సీలో ఎన్నారై లని ఉద్దేశించి ఆసక్తికరంగా ప్రసంగించారు. తెలంగాణాలో కాంగ్రెస్ గెలుపుకి ఎన్నారైల కృషి చాలా ఉంది అన్నారు. ప్రత్యేక రాష్ట్రం, మిగులు బడ్జెట్‌తో ఉన్న రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చిన పదేళ్ళ విధ్వంసం నుంచి తెలంగాణను అభివృద్ధి చేయాలంటే ఎన్నారైల సహకారం చాలా అవసరం. తెలంగాణ ఆర్ధికంగా, దృఢంగా అభివృద్ధి చెందాలంటే ఉచితాలు మంచివి కావు, కానీ ప్రస్తుతం కొందరి పేదలకు, అర్హులకు అవి అవసరం” అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశం కల్పించాలి, చేతి వృత్తులను ప్రోత్సహించాలి, ప్రభుత్వం ఇచ్చే ఉచితాల కోసం ప్రజలు ఎదురు చూసే పరిస్థితి రాకూడదు. ప్రతి తెలంగాణా బిడ్డకూ మెరుగైన విద్య, వైద్యం అవసరం. రాష్ట్రానికి ఆదాయ మార్గాలు సమకూర్చినప్పుడే ఏదైనా సాధ్యం, అందుకే ఇన్వెస్టర్స్‌ని తెలంగాణాకి ఆహ్వానిస్తున్నాం, మీకు కావాల్సిన సహాయ సహకారాలు ప్రభుత్వం తరపున మీకు అందిస్తాము” అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

భారీ కార్ల ర్యాలీకి నాయకత్వం వహించిన నరేందర్ రెడ్డికీ, అలాగే తమ వ్యక్తిగత పనులు మానుకుని ఈ సభను గ్రాండ్ సక్సెస్ చేశారంటూ ఆ టీముకీ, వాలంటీర్లకూ సీఎం రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

సీఎం రేవంత్ రెడ్డి ఇదివరకు కూడా సీఎం హోదాలో ఓసారి అమెరికా వెళ్లారు. ఇప్పుడు రెండోసారి వెళ్లారు. ఇలా వెళ్లినప్పుడు ఎన్నో కొన్ని విదేశీ పెట్టుబడులు తెలంగాణకు వస్తున్నాయి. ఇతరులను ఆకట్టుకునేలా ప్రసంగించడంలో గత సీఎం కేసీఆర్ లాగానే, రేవంత్ రెడ్డి కూడా దిట్టే. అందుకే ఆయన ప్రసంగానికి మంచి స్పందనే వస్తోంది. ఎన్ని పెట్టుబడులు వచ్చాయనేది త్వరలో తెలుస్తుంది. పెట్టుబడులు వస్తే, ప్రభుత్వానికి రెవెన్యూ పెరుగుతుంది. తద్వారా పథకాల అమలుకి వీలవుతుంది.