ఫోన్ పే , గూగుల్ పే నుండి కరెంట్ బిల్లులు కట్టొచ్చు

ఫోన్ పే , గూగుల్ పే నుండి కరెంట్ బిల్లులు చెల్లించవచ్చని TGNPDCL వెల్లడించింది. మొన్న TGSPDCL పరిధిలో ఈ సౌకర్యం రాగా.. తాజాగా NPDCL పరిధిలోనూ అందుబాటులోకి వచ్చింది. భారత్ బిల్పేలో చేరకపోవడంతో RBI ఆదేశాలతో ఈ సంస్థలు ఫోన్పే, గూగుల్పే ద్వారా కరెంట్ బిల్లులు చెల్లించడాన్ని జులై 1న నిలిపివేశాయి. తాజాగా భారత్ బిల్పేలో చేరడంతో గతంలో మాదిరిగానే విద్యుత్ బిల్లులు UPI యాప్లలో నేరుగా చెల్లించవచ్చు.