Notices to Patnam Narender Reddy once again!

పట్నం నరేందర్ రెడ్డికి మరోసారి నోటీసులు !

హైదరాబాద్‌: కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి ఊహించని షాక్‌ తగిలింది. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి బొంరాస్‌పేట్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. రోటిబండ తాండ ఘటనలో పట్నం నరేందర్ రెడ్డికి షరతులకు కూడిన బెయిల్‌ను హైకోర్టు ఇచ్చింది. అయితే బెయిల్ పై ఉండి షరతులను ఉల్లంఘిస్తూ ప్రెస్ మీట్ పెట్టారని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి బొంరాస్‌పేట్ పోలీసులు నోటీసులు ఇచ్చారు.

Advertisements

ఎల్లుండి విచారణకు హాజరుకావాలని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి బొంరాస్‌పేట్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. దీంతో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి ఊహించని షాక్‌ తగిలింది. కాగా, కొడంగల్‌ రైతులపై దాడి చేసిన కుట్రలో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని ఇటీవలే అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే.

కాగా, నవంబర్‌ 11న కొడంగల్ నియోజకవర్గం లగచర్లలో అల్లర్లు జరిగిన సంగతి తెలిసిందే. ఫార్మా కంపెనీ ఏర్పాటు కోసం భూములు సేకరించేందుకు వెళ్లిన కలెక్టర్ ప్రతీక్ జైన్, అధికారులపై దాడి చేశారంటూ 24 మంది రైతులను పోలీసులు అరెస్టు చేశారు. అల్లర్లకు కుట్ర చేశారంటూ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్, సురేశ్ అనే మరో వ్యక్తిని సైతం అరెస్టు చేశారు. రైతులు, ఎమ్మెల్యేను చర్లపల్లి, సంగారెడ్డి జైళ్లకు తరలించారు. దీనిపై తెలంగాణ హైకోర్టును మాజీ ఎమ్మెల్యే ఆశ్రయించారు. విచారణ జరిపిన న్యాయస్థానం 24 మంది రైతులతోపాటు పట్నం నరేందర్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది. డిసెంబర్ 19న ఆయన బెయిల్‌పై బయటకు వచ్చారు.

Related Posts
ఫిబ్రవరి 19న ఢిల్లీ కొత్త సీఎం ప్రమాణస్వీకారం !
Delhi new CM will take oath on February 19!

సీఎం రేసులో పర్వేశ్‌ వర్మ ముందంజ..! న్యూఢిల్లీ: ఢిల్లీలో బీజేపీ అత్యధిక సీట్లు గెలిచి అధికారాన్ని కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. 70 అసెంబ్లీ స్థానాలకు గానూ Read more

Gautam Gambhir : గౌతమ్ గంభీర్‌ను చంపేస్తామంటూ బెదిరింపులు
Kill Gautam Gambhir with threats

Gautam Gambhir : టీమిండియా హెడ్‌కోచ్, బీజేపీ మాజీ ఎంపీ గౌతమ్ గంభీర్‌కు ఐసిస్ కశ్మీర్ నుంచి బెదిరింపులు వచ్చాయి. తనను చంపుతామంటూ 'ఐసిస్‌ కశ్మీర్‌' నుంచి Read more

TSPSC : గ్రూప్ 1 నియామకాల‌కు లైన్ క్లియ‌ర్
TSPSC గ్రూప్ 1 నియామకాల‌కు లైన్ క్లియ‌ర్

తెలంగాణలో గ్రూప్ 1 నియామకాల కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. ఎట్టకేలకు ఈ నియామకాలకు అడ్డంకులు తొలగిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీఓ Read more

జనసేనలోకి మాజీ MLA ?
జనసేనలోకి మాజీ MLA ?

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వేడిమి రోజు రోజుకు పెరుగుతోంది. తాజాగా, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు జనసేనలో చేరనున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను ఆయన కుటుంబ Read more

Advertisements
×