Northern Arizona University partners with Risaya Academy to launch summer school for Indian students in USA

యుఎస్ఏలో భారతీయ విద్యార్థుల కోసం వేసవి పాఠశాలను ప్రారంభించేందుకు రిసాయా అకాడమీతో నార్తర్న్ అరిజోనా యూనివర్సిటీ భాగస్వామ్యం

• ఈ భాగస్వామ్యం ద్వారా తమ విద్యార్థులకు ప్రపంచ అనుభవాన్ని మెరుగుపరుస్తోన్న మల్లా రెడ్డి యూనివర్సిటీ , హైదరాబాద్..
• కంప్యూటర్ ఇంజనీరింగ్ మరియు ఇమ్మెర్సివ్ మీడియాలో గ్లోబల్ లెర్నింగ్ అవకాశాలను విస్తరించనున్నారు..

హైదరాబాద్, ఇండియా , నార్తర్న్ అరిజోనా యూనివర్శిటీ (ఎన్ఏయు ), రిసాయా అకాడమీతో భాగస్వామ్యం చేసుకుని , యుఎస్ఏలోని ఎన్ఏయు యొక్క మహోన్నతమైన క్యాంపస్‌లో భారతీయ విద్యార్థులకు ఒక ప్రత్యేకమైన విద్యా అనుభవాన్ని అందిస్తూ, సమ్మర్ స్కూల్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించినట్లు వెల్లడించింది. ఈ భాగస్వామ్యం కు మల్లా రెడ్డి విశ్వవిద్యాలయం తో ఉన్న అవగాహన ఒప్పందం మద్దతు అందిస్తుంది. నేటి గ్లోబల్ టెక్ ల్యాండ్‌స్కేప్‌కు అవసరమైన నైపుణ్యాలతో విద్యార్థులను సన్నద్ధం చేయడానికి రూపొందించబడిన కంప్యూటర్ ఇంజనీరింగ్ మరియు ఇమ్మర్సివ్ మీడియాలో అత్యాధునిక విద్యను అందించడంలో ఒక ముఖ్యమైన ముందడుగును ఇది సూచిస్తుంది.

భారతదేశంలో మొదటిసారిగా ప్రారంభించబడిన ఈ ఇంటెన్సివ్ సమ్మర్ ప్రోగ్రామ్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బ్లాక్‌చెయిన్, ఏఐ/ఎంఎల్, మరియు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (ఈసిఈ) వంటి రంగాలలో డిగ్రీలు అభ్యసిస్తున్న విద్యార్థులు ఎదుర్కొంటున్న క్లిష్టమైన నైపుణ్య అంతరాన్ని పరిష్కరించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కార్యక్రమం యుఎస్ఏలోని ప్రముఖ విశ్వవిద్యాలయాలలో పోస్ట్‌గ్రాడ్యుయేట్ అవకాశాల కోసం విద్యార్థులను సిద్ధం చేసే కేంద్రీకృత 5-వారాల అధ్యయన మాడ్యూల్‌ను అందిస్తుంది, అదే సమయంలో వారికి ప్రతిష్టాత్మకమైన ఎన్ఏయు సర్టిఫికేషన్ కూడా లభిస్తుంది.

ఈ కార్యక్రమంలో భాగంగా, విద్యార్థులు హైబ్రిడ్ లెర్నింగ్ మోడల్‌లో పాల్గొనడానికి అవకాశం కలుగుతుంది. భారతదేశంలో తమ కోర్సులో కొంత భాగాన్ని పూర్తి చేయడానికి మరియు యుఎస్ఏ లోని ఎన్ఏయు యొక్క అత్యాధునిక క్యాంపస్‌లో వారి విద్యా ప్రయాణాన్ని కొనసాగించడానికి అవకాశం ఉంటుంది. ఈ విధానం అంతర్జాతీయ విద్యను మరింత అందుబాటులోకి తీసుకురావడమే కాకుండా విలువైన క్రాస్-కల్చరల్ ఎక్స్‌పోజర్‌ను అందిస్తుంది, వారి ప్రపంచ అభ్యాస అనుభవాన్ని మెరుగుపరుస్తుంది.

మల్లా రెడ్డి విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ విఎస్కె రెడ్డి ఈ కార్యక్రమం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ , “ఈ కార్యక్రమం మా విద్యార్థులు తమ నైపుణ్యాలను పెంచుకోవడానికి మరియు పరిశ్రమకు సిద్ధంగా ఉన్న నిపుణులుగా ఎదగడానికి ఒక గొప్ప అవకాశం. విద్యా పరిజ్ఞానం మరియు ఆచరణాత్మక నైపుణ్యం మధ్య అంతరాన్ని తగ్గించడం ద్వారా, పోటీ ప్రపంచ వాతావరణంలో విజయం సాధించడానికి అవసరమైన సాధనాలతో వారిని సన్నద్ధం చేస్తుంది. మల్లారెడ్డి విశ్వవిద్యాలయంలో, మేము నాయకత్వం , ఆవిష్కరణలను పెంపొందించడానికి కట్టుబడి ఉన్నాము. ఈ భాగస్వామ్యం విద్యా శ్రేష్ఠత మరియు పరిశ్రమ సమలేఖనానికి కొత్త ప్రమాణాలను నిర్దేశిస్తుంది” అని అన్నారు.

కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మరియు మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్) వంటి పరివర్తన రంగాలపై ఎన్ఏయు యొక్క సమ్మర్ స్కూల్ దృష్టి సారిస్తుంది. ఐటి , ఎలక్ట్రానిక్స్, ఏఐ ఆధారిత సాంకేతికతలు మరియు ఆటోమేషన్ వంటి పరిశ్రమలలో ఈ విభాగాలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. ఐటి మరియు సాంకేతిక ఆవిష్కరణలకు భారతదేశం యొక్క కేంద్రంగా హైదరాబాద్ ఉండటంతో, ఈ మార్గదర్శక ప్రయత్నానికి ఇది ఆదర్శవంతమైన వేదికగా నిలుస్తుంది.

ఎన్ఏయు వద్ద గ్లోబల్ అఫైర్స్ అసోసియేట్ వైస్ ప్రోవోస్ట్ శ్రీ సీజర్ ఫ్లోర్స్ మాట్లాడుతూ, “భారతీయ విద్యార్థులకు ఈ అవకాశాన్ని అందించడానికి రిసాయా అకాడమీతో భాగస్వామ్యం చేసుకోవటం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమం అకడమిక్ ఎక్సలెన్స్‌ను ప్రోత్సహించడమే కాకుండా విద్యార్థులు ఎన్ఏయు యొక్క ప్రపంచ-స్థాయి అధ్యాపకులు మరియు అత్యాధునిక వనరులతో వినియోగించుకోవటానికి అనుమతిస్తుంది” అని అన్నారు.

కంప్యూటర్ ఇంజనీరింగ్ మరియు ఇమ్మర్సివ్ మీడియా మరియు గేమ్ డిజైన్‌లో ఎన్ఏయు యొక్క 4-సంవత్సరాల బిటెక్ ప్రోగ్రామ్‌లు విద్యార్థులకు భారతదేశంలో తరగతి గది అభ్యాసం నుండి యుఎస్ఏలో అధునాతన అధ్యయనాలకు సౌకర్యవంతమైన పరివర్తనను అందిస్తాయి. కంప్యూటర్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ ఎలక్ట్రానిక్స్ మరియు తయారీ పరిశ్రమల డిమాండ్‌లను తీర్చడానికి విద్యార్థులను సిద్ధం చేస్తుంది, అయితే ఇమ్మర్సివ్ మీడియా కోర్సు ఏఆర్/విఆర్ , వేరబల్స్ మరియు గేమింగ్ సొల్యూషన్‌లలో అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలపై దృష్టి సారిస్తుంది.

“ఈ భాగస్వామ్యం, భారతీయ విద్యార్థులకు నైపుణ్యాన్ని పెంపొందించుకోవడానికి మరియు గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌తో తమను తాము సమలేఖనం చేసుకోవడానికి ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని ఇస్తుంది” అని రిసాయా అకాడమీ సీఈఓ శ్రీ రతీష్ బాబు అన్నారు. “పరిశోధన మరియు ఆవిష్కరణలలో అగ్రగామిగా ఎన్ఏయు యొక్క కీర్తి ఈ కార్యక్రమంకు సరైన భాగస్వామిగా చేస్తుంది” అని అన్నారు.

ఎన్ఏయు యొక్క సమ్మర్ స్కూల్ మరియు పార్ట్-స్టడీ ప్రోగ్రామ్ కోసం దరఖాస్తులు ఇప్పుడు భారతీయ విద్యార్థుల కోసం తెరవబడ్డాయి. సమ్మర్ స్కూల్ జూలై 2025లో ప్రారంభమవుతుంది మరియు 5 వారాల పాటు కొనసాగుతుంది, విద్యార్థులకు అకడమిక్ క్రెడిట్‌లను సంపాదించడానికి మరియు ఎన్ఏయు సర్టిఫికేషన్‌ను పొందే అవకాశాన్ని అందిస్తుంది. ఆసక్తిగల విద్యార్థులు మరింత సమాచారం కోసం ఎన్ఏయు అధికారిక వెబ్‌సైట్ లేదా రిసాయా అకాడమీ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

ఈ మార్గదర్శక కార్యక్రమంతో, నార్తర్న్ అరిజోనా యూనివర్సిటీ మరియు రిసాయా అకాడమీ ప్రపంచ విద్యలో కొత్త పుంతలు తొక్కడమే కాకుండా, తదుపరి తరం ఇంజనీర్లు మరియు ఆవిష్కర్తలు ప్రపంచ వేదికపై రాణించడానికి మార్గం సుగమం చేస్తున్నాయి. ఈ భాగస్వామ్యం అకడమిక్ ఎక్సలెన్స్ మరియు క్రాస్-బోర్డర్ సహకారానికి నిబద్ధతను కలిగి ఉంటుంది, విద్యార్థులు వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగంలో నాయకత్వం వహించడానికి అవసరమైన నైపుణ్యాలు మరియు అనుభవాలను అందిస్తుంది. ఇది విద్య మరియు ఆవిష్కరణల భవిష్యత్తును మార్చడానికి హామీ ఇచ్చే ప్రయాణం యొక్క ప్రారంభం మాత్రమే.

Related Posts
దావోస్ పర్యటనకు బయలుదేరిన చంద్రబాబు నాయుడు
దావోస్ పర్యటనకు బయలుదేరిన చంద్రబాబు నాయుడు

రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడం లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటనకు బయలుదేరారు. ఉదయం తన నివాసం నుండి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆయన, అధికారుల Read more

ఏపీలో ‘అందరికీ ఇళ్లు’
Housing Scheme

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సామాజిక న్యాయం, స్త్రీ సాధికారత లక్ష్యంగా 'అందరికీ ఇళ్లు' పథకాన్ని ప్రవేశపెట్టింది. గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల స్థలాలను మహిళల పేరుతో Read more

చంద్రబాబు బయోపిక్ లో ధనుష్..?
chandrababu dhanush

కోలీవుడ్ దిగ్గజ హాస్యనటుడు చంద్రబాబు జీవిత చరిత్ర ఆధారంగా బయోపిక్ నిర్మించేందుకు ప్రముఖ నిర్మాణ సంస్థ గోపాల్ వన్ స్టూడియోస్ సన్నద్ధమవుతోంది. తమిళ సినిమా రంగంలో అత్యధిక Read more

నేడు ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష
CM revanth reddy review with higher officials today

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భూ భారతి, ఇందిరమ్మ ఇళ్లపై వివరాలను అధికారుల నుంచి తెలుసుకోనున్నారు. ఇప్పటికే Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *