Nominations have started for the election of the GHMC Standing Committee.

జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికకు ప్రారంభమైన నామినేషన్లు..!

జీహెచ్ఎంసీ రిటర్నింగ్ అధికారి వద్ద నాలుగు నామినేషన్లు దాఖలు


హైదరాబాద్‌ : జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికకు కార్పొరేటర్ల నామినేషన్లు ప్రారంభమయ్యాయి. ఈరోజు జీహెచ్ఎంసీ రిటర్నింగ్ అధికారి వద్ద నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ నాలుగు నామినేషన్లలో రెండు కాంగ్రెస్, రెండు బిఆర్ఎస్ తరపున దాఖలు అయ్యాయి. బీఆర్ఎస్ నుంచి కూకట్పల్లి కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ, అడ్డగుట్ట కార్పొరేటర్ ప్రసన్న లక్ష్మి నామినేషన్ దాఖలు చేయగా.. కాంగ్రెస్ నుంచి నామినేషన్లు దాఖలు చేసిన వేళల్లో హిమాయత్ నగర కార్పొరేటర్ మహాలక్ష్మి గౌడ్, రామచంద్రాపురం కాంగ్రెస్ కార్పొరేటర్ పుష్ప ఉన్నారు.

image

ఈ రోజే జీహెచ్ఎంసీ రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను అందించారు కార్పొరేటర్లు. అయితే ఈ నెల 17 వరకు ఈ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సాగనుంది. ఇక ఇన్నిరోజుల పాటు తమకు స్టాండింగ్ కమిటీ లో చోటు లేదని.. ఈసారి తప్పకుండా గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ కార్పొరేటర్లు. అదే సమయంలో పార్టీలకు అతీతంగా బీజేపీ కార్పొరేటర్లు కూడా మాకు ఓటేస్తారంటున్నారు బీఆర్ఎస్ కార్పొరేటర్లు.

Related Posts
వల్లభనేని వంశీ అంటేనే అరాచకం – మంత్రి నిమ్మల
వల్లభనేనివంశీ అక్రమార్జన రూ.195 కోట్లు

వైసీపీ నేత వల్లభనేని వంశీ అరాచకాలకు, అవినీతికి మారుపేరని మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్రంగా విమర్శించారు. ఆయన అక్రమ కార్యకలాపాలను సమర్థిస్తూ జగన్ మోహన్ రెడ్డి కూడా Read more

కిషన్ రెడ్డి ని ప్రశ్నించిన ఉపరాష్ట్రపతి ధన్కర్..
కిషన్ రెడ్డి ని ప్రశ్నించిన ఉపరాష్ట్రపతి ధన్కర్..

కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డికి బొగ్గు మరియు గనుల రంగంలో చేసిన కీలక ఆవిష్కరణలకు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ అభినందనలు తెలిపారు. ఆయన కిషన్ రెడ్డికి Read more

హాల్ టిక్కెట్ లేకున్నా పరీక్షలకు అనుమతించాలి: తెలంగాణ ఇంటర్ బోర్డు
intermediate exams

హాల్ టిక్కెట్ లేకున్నా విద్యార్థులను పరీక్షలకు అనుమతించాలని తెలంగాణ ఇంటర్మీడియేట్ బోర్డు ప్రకటించింది. తెలంగాణలో ఇంటర్ హాల్ టిక్కెట్ల జారీలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. సీజీజీ పోర్టల్‌లో సాంకేతిక Read more

Justice Varma Cash Row : జస్టిస్ వర్మ అంశంపై స్పందించిన జగ్‌దీప్ ధన్‌ఖడ్
Justice Varma Cash Row జస్టిస్ వర్మ అంశంపై స్పందించిన జగ్‌దీప్ ధన్‌ఖడ్

Justice Varma Cash Row : జస్టిస్ వర్మ అంశంపై స్పందించిన జగ్‌దీప్ ధన్‌ఖడ్ న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో పెద్ద మొత్తంలో నగదు కనిపించడం Read more