No bias against Perni Nani - Nadendla Manohar

పేర్ని నానిపై ఎటువంటి కక్ష లేదు – నాదెండ్ల మనోహర్

వైసీపీ నేత పేర్ని నానిపై తమకు ఎటువంటి వ్యక్తిగత కక్షా లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ‘మా ప్రభుత్వానికి కుట్రలు చేయాల్సిన అవసరం లేదు. ఎవరైనా తప్పు చేస్తే వారు న్యాయ ప్రక్రియకు లోబడాలి’ అని ఆయన వ్యాఖ్యానించారు. నాని సంబంధించిన గిడ్డంగుల కేసుపై వివరణ ఇచ్చిన నాదెండ్ల, న్యాయం గెలుస్తుందని పేర్కొన్నారు.

‘నాని గిడ్డంగు తన భార్య పేరిట తీసుకోవడం ఎందుకు? గిడ్డంగు తనిఖీల అనంతరం నోటీసులు పంపినా, ఆయన స్పందించకపోవడం ఏమిటి?’ అని ప్రశ్నించారు. ప్రభుత్వ పరంగా తాము న్యాయమార్గంలోనే చర్యలు తీసుకుంటున్నామని, రాజకీయ కక్షతో కాదు అని ఆయన అన్నారు. పేర్ని నానిపై నమోదైన కేసులు ఆయన చేసిన తప్పుల కారణంగానే అని నాదెండ్ల అభిప్రాయపడ్డారు. ఎవరైనా వారి పేరిట గిడ్డంగు ఉంటే, వారి మీదే కేసులు నమోదవుతాయి. ఇక్కడ ఎవరికీ ప్రత్యేక ట్రీట్మెంట్ లేదు అని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా వైసీపీ పాలనపై కూడా నాదెండ్ల తీవ్ర విమర్శలు చేశారు. ‘YSRCP ఐదేళ్లపాటు అరాచక పాలన సాగించింది. ప్రజాస్వామ్య విలువలను పక్కదోవ పట్టించింది. ఇప్పుడు మేము వచ్చాక, ప్రజలకు న్యాయం చేయడం కోసం చర్యలు తీసుకుంటున్నాం’ అని ఆయన అన్నారు.

Related Posts
అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా
Judgment on Allu Arjun bail petition adjourned

హైదరాబాద్‌: టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా పడింది. నేడు అల్లు అర్జున్ రెగ్యూలర్ బెయిల్ పిటిషన్ పై విచారణ చేపట్టిన నాంపల్లి Read more

విజయవాడలో పుస్తక మహోత్సవం
Book festival in Vijayawada

విజయవాడలోని ఎంజీ రోడ్డులో ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో నేడు 35వ పుస్తక మహోత్సవం ఘనంగా ప్రారంభం కానుంది. ఈ సాయంత్రం 6 గంటలకు ఉపముఖ్యమంత్రి పవన్‌ Read more

ఐఈఈఈ జీఆర్ఎస్ఎస్ ఎస్ వై డబ్ల్యు 2024 ను నిర్వహించిన కెఎల్‌హెచ్‌ అజీజ్ నగర్
KLH Aziz Nagar organized IEEE GRSS SYW 2024

న్యూఢిల్లీ : హైదరాబాదులోని కెఎల్‌హెచ్‌ డీమ్డ్ టు బి యూనివర్సిటీ, ఐఈఈఈ జియోసైన్స్ మరియు రిమోట్ సెన్సింగ్ సొసైటీ (జీఆర్ఎస్ఎస్) స్టూడెంట్ , యంగ్ ప్రొఫెషనల్ మరియు Read more

ఢిల్లీ పురవీధుల్లో కొత్త నాటకం: కేటీఆర్‌
ktr comments on cm revanth reddy

హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీలో కొత్త నాటకం మొదలు పెట్టారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆరోపించారు. తల్లికి బువ్వ పెట్టనోడు-చిన్నమ్మకు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *