NITI Aayog Vice Chairman meets AP CM

ఏపీ సీఎంతో నీతి అయోగ్ వైస్ ఛైర్మన్ భేటీ

అమరావతి : ఏపీ సీఎం చంద్రబాబుతో నీతి అయోగ్ వైస్ ఛైర్మన్ సుమన్ భేరీ నేతృత్వంలోని బృందం ఈరోజు సమావేశమైంది. సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, 2047-విజన్ డాక్యుమెంట్ పై వారు చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే, రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపైనా ఈ సమావేశంలో చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

image

ప్రస్తుతం ఏపీలో లోటు బడ్జెట్ కారణంగా అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు సరిపోవడం లేదని, సూపర్ సిక్స్ గ్యారెంటీలకు కూడా నిధుల లోటు గురించి ఈ సందర్భంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. సీఎం చంద్రబాబుతో పాటు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సైతం ఈ మీటింగులో పాల్గొన్నారు. కాగా, బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు నీతి ఆయోగ్ ప్రతినిధి బృందంతో సీఎం చంద్రబాబు భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవలే 16వ ఫైనాన్స్ కమిషన్ ఛైర్మన్ పనగారియాను సీఎం చంద్రబాబు, పయ్యావుల కలిసిన విషయం తెలిసిందే.

ఇకపోతే..అలాగే నీతిఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బేరీ ఈ భేటీకి ప్రాతినిధ్యం వహించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, వికసిత్ ఏపీ- 2047 విజన్ డాక్యుమెంట్‌‌పై ప్రధానంగా చర్చించనున్నారు. ఏపీకి ఉన్న అప్పులు వాటితో పాటు చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలపై సమావేశంలో చర్చ జరుగనుంది. రాష్ట్రంలోని ఆర్థిక పరిస్థితిని వారికి వివరించనున్నారు. 16వ ఫైనాన్స్‌ కమిషన్‌ను కూడా కలిసిన నేపథ్యంలో రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులను రప్పించుకోవడంతో పాటు పన్నుల్లో వాటా, వివిధ కేంద్ర ప్రయోజిత పధకాల్లో రావాల్సిన వాటాలపైన రాష్ట్రం తీసుకుంటున్న చర్యలు, సంక్షేమానికి సంబంధించిన అంశాలపై వీరి భేటీలో సుదీర్ఘంగా చర్చ జరిగే అవకాశం ఉంది.

Related Posts
రూపాయి గుర్తు మార్పుపై పెరుగుతున్న వివాదం
రూపాయి గుర్తు మార్పుపై పెరుగుతున్న వివాదం

రూపాయి గుర్తు మార్పుపై పెరుగుతున్న వివాదం తమిళనాడు అసెంబ్లీలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ప్రస్తుత ప్రభుత్వ ఆర్థిక మంత్రి తంగం తెన్నరసు మార్చి 14, Read more

పన్నులు తగ్గించాలని కోరవద్దు : పరిశ్రమ వర్గాలకు గడ్కరీ సూచన
Don't ask for tax cuts.. Gadkari advice industry groups

న్యూఢిల్లీ: కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ జీఎస్టీ, ఇతర పన్నులు తగ్గించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయొద్దని పరిశ్రమ వర్గాలకు సూచించారు. పేదల కోసం సంక్షేమ పథకాలను అమలు చేయడానికి Read more

యూరోపియన్ నేతల అత్యవసర సమావేశం
యూరోపియన్ నేతల అత్యవసర సమావేశం

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్ ఆధ్వర్యంలో యూరోపియన్ నాయకులు సోమవారం పారిస్‌లో అత్యవసర భద్రతా సమావేశానికి హాజరయ్యారు. దీనికి ప్రధాన కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ Read more

ఢిల్లీలో ఏఐసీసీ ప్రారంభోత్సవానికి సీఎం
ఢిల్లీలో ఏఐసీసీ ప్రారంభోత్సవానికి సీఎం

కొత్త ఏఐసీసీ కార్యాలయం, ఇందిరా గాంధీ భవన్ ను కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు Read more