న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న పాకిస్తాన్ క్రికెట్ జట్టు వరుస ఓటములతో కష్టాల్లో పడింది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా రెండో టీ20లోనూ పాకిస్తాన్ జట్టు ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో ఆతిథ్య కివీస్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. పాక్ నిర్దేశించిన 136 పరుగుల లక్ష్యాన్ని కివీస్ బ్యాట్స్‌మెన్ మరో 11 బంతులు మిగిలి ఉండగానే చేధించి, సిరీస్‌ను 2-0 తేడాతో తమ వశం చేసుకునే దిశగా ముందడుగు వేసింది.

వర్షం కారణంగా తగ్గిన ఓవర్లు
వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ను 15 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 15 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 135 పరుగులు మాత్రమే చేయగలిగింది. కెప్టెన్ సల్మాన్ అఘా 46 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, షాదాబ్ ఖాన్ 26, షాహీన్ షా అఫ్రిది 22 పరుగులు చేసి నిలబడ్డారు. అయితే మిగతా బ్యాట్స్‌మెన్ పూర్తిగా విఫలమయ్యారు. కివీస్ బౌలర్లలో జాకబ్ డఫ్ఫీ, బెన్ సీయర్స్, జేమ్స్ నీషమ్, ఇష్ సోధీ తలో రెండు వికెట్లు పడగొట్టారు. 136 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు మొదటి నుంచే దూకుడుగా ఆడింది. ఓపెనర్లు టిమ్ సీఫర్ట్, ఫిన్ అలెన్ పవర్‌ఫుల్ షాట్లతో స్కోరు బోర్డును వేగంగా ముందుకు నడిపించారు. ఈ ఇద్దరూ కలిసి తొలి వికెట్‌కు 66 పరుగుల భాగస్వామ్యం నమోదు చేయగా, సీఫర్ట్ 45 (23 బంతుల్లో) పరుగులు, అలెన్ 38 (24 బంతుల్లో) పరుగులు చేసి జట్టుకు శుభారంభాన్ని అందించారు. దీంతో పాటు మిచెల్ హే 21 పరుగులతో మంచి తోడ్పాటు అందించగా, చివరికి కివీస్ 13.1 ఓవర్లలోనే 5 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. పాక్ బౌలర్లలో హరీస్ రౌఫ్ రెండు వికెట్లు తీయగా, మహ్మద్ అలీ, కుష్దీల్ షా, జహాందాద్ ఖాన్ చెరో వికెట్ తీశారు. ఈ విజయంతో న్యూజిలాండ్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక మిగిలిన మూడు మ్యాచ్‌లను గెలిచి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలని కివీస్ చూస్తుండగా, పాకిస్తాన్ మాత్రం మిగిలిన మ్యాచ్‌ల్లో గెలిచి పరువు నిలుపుకోవాలని ప్రయత్నిస్తోంది.
పాకిస్తాన్ ఓటమికి కారణం
ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ బలహీనతలు స్పష్టంగా కనిపించాయి. బ్యాటింగ్ విభాగంలో టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలమవ్వడంతో, పాక్ తక్కువ స్కోరుకే పరిమితం అయింది. ముఖ్యంగా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్లు పెద్దగా రాణించకపోవడం, కీలక సమయంలో వికెట్లు కోల్పోవడం వల్ల పెద్ద స్కోరు చేయలేకపోయింది. అదే సమయంలో కివీస్ బౌలింగ్ విభాగంలో మెరుగైన ప్రదర్శన కనబరిచింది. ముఖ్యంగా పవర్‌ప్లేలోనే కీలక వికెట్లు తీయడం, చివరి ఓవర్లలో ఒత్తిడి పెంచడం విజయానికి దారితీసింది. ఇక బ్యాటింగ్‌లోనూ ఆతిథ్య జట్టు కనబర్చిన చురుకుదనం పాక్‌పై విజయాన్ని సులభతరం చేసింది. ఇప్పటికే సిరీస్‌లో 2-0 తేడాతో వెనుకబడిన పాక్ జట్టు మూడో టీ20లో తప్పక విజయం సాధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. లేదంటే సిరీస్ కివీస్ చేతిలోనే వెళ్లిపోయే అవకాశం ఉంది.