satya prasad

ఫిబ్రవరి 1 నుండి కొత్త రిజిస్ట్రేషన్ విలువలు: సత్యప్రసాద్

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు మార్పులను చేస్తున్నది. ఇందులో భాగంగా రిజిస్ర్టేషన్ విధానంలోను మార్పులను తీసుకుని వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో ఫిబ్రవరి ఒకటో తేదీ నుండి కొత్త రిజిస్ర్టేషన్ విలువలు అమల్లోకి వస్తాయని, దీనికి సంబంధించి ఇప్పటికే సుదీర్ఘ కసరత్తు చేశామని రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ర్టేషన్ అండ్ స్టాంప్స్ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. అయితే రాజధాని గ్రామాల్లో మాత్రం రిజిస్ట్రేషన్ విలువల్లో ఎటువంటి మార్పు ఉండదని చెప్పారు. ఆయన సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ .. రాష్ట్రంలో గ్రోత్ సెంటర్లుగా ఉండి, మార్కెట్ విలువ 10 రెట్లు అదనంగా ఉన్న ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ విలువలు పెరుగుతాయన్నారు. కొన్ని ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ విలువలు అక్కడి మార్కెట్ విలువల కన్నా ఎక్కువగా ఉన్నాయని ఆ ప్రాంతాల్లో విలువలు తగ్గుతాయని చెప్పారు.

గత ప్రభుత్వ హయాంలో ఎమ్మార్వోలను అడ్డం పెట్టుకొని పెద్ద ఎత్తున భూ అక్రమాలకు పాల్పడ్డారని, అలా పేదల భూములను అక్రమ పద్ధతుల్లో వశం చేసుకున్న వారందరినీ వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. నేరం రుజువైన అధికారులపైన కఠిన చర్యలు కచ్చితంగా తీసుకుంటామని తెలిపారు. భూ వివాదాలకు సంబంధించి సమగ్రంగా అధ్యయనం చేసేందుకు 22ఏ భూములు, 596 జీవోలతో పాటు మరో నాలుగు అంశాలపై కలెక్టర్లతో కమిటీలను నియమించనున్నట్లు చెప్పారు.

Related Posts
ఏపీలో పెరుగుతున్న క్యాన్సర్ కేసులు
Cancer cases on the rise in

ఆంధ్రప్రదేశ్‌లో క్యాన్సర్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో 100 మందిలో ఒకరు క్యాన్సర్ అనుమానితులుగా ఉన్నట్లు ప్రభుత్వ స్క్రీనింగ్ పరీక్షల్లో తేలింది. ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన Read more

ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
AP Cabinet Decisions

అమరావతిలోని సచివాలయంలో బుధవారం మంత్రివర్గ సమావేశం సుదీర్ఘంగా జరిగింది. మంత్రివర్గంలో రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై కూలంకషంగా చర్చ జరగ్గా.. కొన్ని విషయాల్లో సీఎం చంద్రబాబు మంత్రులకు Read more

చీటింగ్ లో పీహెచ్ డీ చేసిన బాబు: జగన్‌
Babu who did PhD in cheating..Jagan

అమరావతి: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ గురువారం ఉదయం మీడియా ముందుకు వచ్చారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఐదేళ్ల పాలనలో ఒక్క Read more

నాలెడ్జ్ హబ్‌గా ఏపీని నిలపడమే లక్ష్యం – సీఎం చంద్రబాబు
The aim is to make AP a kno

విశాఖపట్నం : అత్యాధునిక సాంకేతికత – ఇన్నోవేషన్‌ అభివృద్ధికి దోహదం చేస్తాయని, ఈ విషయంలో ముందుండాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్‌ను నాలెడ్జ్ హబ్‌గా నిలిపాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్టు ముఖ్యమంత్రి Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *