ఉద్యోగులకు పెన్షన్ విధానంలో మార్పులు తెస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ఇక నుంచి ఏకీకృత పెన్షన్ స్కీం (UPS) అమలు చేయనుంది. ఈ క్రమంలో రాష్ట్రాలు సైతం ఇదే విధానం అమలు చేసే అవకాశం కనిపిస్తోంది. కొత్త విధానం అమల్లోకి తెస్తూనే కేంద్రం ఉద్యోగులకు వెసులుబాటు కల్పించారు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎన్పీఎస్ కింద యూపీఎస్ ను ఎంపికను ఎంచుకోనే అవకాశం ఇస్తూనే.. అదే సమయంలో యూపీఎస్ ఎంపిక లేకుండా ఎన్పీఎస్ తో కొనసాగేలా ఆప్షన్ ను ఉద్యోగులకే ఇచ్చారు.
ఏప్రిల్ 1 నుంచి కొత్త పెన్షన్ విధానం
కొత్త పెన్షన్ విధానం కేంద్రం ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త పెన్షన్ విధానం అమలుకు కసరత్తు పూర్తి చేసింది. కేంద్ర ప్రభుత్వం ఆమోదంతో ఇక పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు యూపీఎస్ పథకం అమలు కానుంది. ఈ పథకం ఇప్ప టికే ఎన్పీఎస్ లో ఉన్న ఉద్యోగులకూ వర్తిస్తుంది. ఇది పాత పెన్షన్ పథకం (OPS), జాతీయ పెన్షన్ వ్యవస్థ (NPS) రెండింటి ప్రయోజనాలను కలిపి యూపీఎస్ గా రూపకల్పన చేసారు. ఇప్పుడు ఉద్యోగులు దీని నుంచి పెన్షన్ పొందుతున్నారు. యూపీఎస్ అనేది ప్రభుత్వ కొత్త పథకం. జనవరి 24న ప్రభుత్వం యూపీఎస్ ను అధికారికంగా నోటిఫై చేసింది. ఎన్పీఎస్ కిందకు వచ్చే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ యూపీఎస్ పథకం వర్తిస్తుందని అధికారులు స్పష్టం చేసారు.

ఏకమొత్తం చెల్లింపు
తాజా నిర్ణయంతో వాజ్‌పేయి హయాంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్‌పీఎస్‌ను ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో పాత పెన్షన్ పథకం, ఎన్పీఎస్ ప్రయోజనాలను కలిపి తాజాగా యూపీఎస్ గా రూపొందించారు. ఈ పథకంలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులు చివరిగా వారు తీసుకున్న జీతంలో 50% పెన్షన్‌గా అందిస్తుంది. అదే విధంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం, కుటుంబ పెన్షన్, ఏకమొత్తం చెల్లింపు వంటి ప్రయోజనాలు అందుతా యి. ఎన్పీఎస్ కింద ఉన్న ఉద్యోగులకు సైతం యూపీఎస్ ఎంచుకునే అవకాశం ఉంటుంది. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు కూడా యూపీఎస్ కింద ప్రయోజనాలను అందిస్తారు. యూపీఎస్ కింద ఉద్యోగి మరణించిన తర్వాత, పెన్షన్‌లో 60% అతని కుటుంబానికి కుటుంబ పెన్షన్‌గా ఇస్తారు.
గ్రాట్యుటీతో ఒకేసారి చెల్లింపు
ప్రయోజనాలు ఇక, పదవీ విరమణ సమయంలో.. గ్రాట్యుటీతో ఒకేసారి చెల్లింపు కూడా లభిస్తుంది. ఒక ఉద్యోగి కేంద్ర ప్రభు త్వంలో కనీసం 10 సంవత్సరాలు పనిచేస్తే, అతనికి నెలకు కనీసం రూ. 10,000 పెన్షన్ లభిస్తుంది. యూపీఎస్ ని ఎంచుకునే ఉద్యోగుల పదవీ విరమణ నిధి రెండు భాగాలుగా విభజించారు. ఒకటి వ్యక్తిగత నిధి, మరొకటి పూల్ నిధి. వ్యక్తిగత నిధికి ఉద్యోగి, ప్రభుత్వం నుంచి సమాన సహకారం ఉంటుంది. పూల్ ఫండ్‌లో ప్రభుత్వం నుంచి అదనపు సహకారం ఉంటుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 23 లక్షల మంది ప్రభు త్వ ఉద్యోగులకు యూపీఎస్ – ఎన్పీఎస్ మధ్య ఎంచుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా యూపీఎస్ ని ఎంచుకునే ఛాన్స్ ఇస్తుంది.