ఏపీలో అక్టోబర్ 1 నుంచి కొత్త మద్యం పాలసీ : మంత్రి కొల్లు రవీంద్ర

New liquor policy in AP from October 1: Minister Kollu Ravindra

అమరావతి: అక్టోబర్ 1 నుంచి కొత్త మద్యం పాలసీ తీసుకొస్తామని మంత్రి కొల్లు రవీంద్ర ప్రకటించారు. సింహాద్రి అప్పన్నను దర్శించుకున్నారు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర. ఈ సందర్భంగా ఆలయ ఈవో, అధికారులు..కొల్లు రవీంద్రకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం కొల్లు రవీంద్ర మాట్లాడుతూ..సింహాద్రి అప్పన్న ఎంతో మహిమన్వితం కలిగిన దేవుడు అన్నారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రజలంతా సుఖషాంతులతో ఉండాలని కోరుకోవడం జరిగిందని చెప్పారు.

గత ఐదు సంవత్సరాల వై. సి. పి. పాలనలో ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో చూసాము..ప్రజల కోరిక మేరకు సంక్షేమ పధకాలు అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ముందుకొచ్చారన్నారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో ఐదు సంవత్సరాలలో అన్ని వర్గాలు ఇబ్బంది పడ్డారు..పరిశ్రమలు రాకుండా అడ్డుకున్నారన్నారు. ఉన్న పరిశ్రమల్ని మూసేశారు..ఆరోజు చంద్రబాబు పిలుపు మేరకు ఇన్వెస్ట్ మెంట్ పెట్టడానికి పెద్ద సంస్థలు వొస్తున్నాయని చెప్పారు. విశాఖ పట్నంలో కొండాలని, ఘనులను, భూములను దోచుకున్నారు. ఋషికొండలో ప్రజల సొమ్ముతో ప్యాలస్ లు కట్టుకున్నారని ఆరోపణలు చేశారు.