New Judges for Telugu States

తెలుగు రాష్ట్రాలకు కొత్త న్యాయమూర్తులు

ఏపీకి ఇద్దరు, తెలంగాణకు నలుగురు న్యాయమూర్తులు..

హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాలకు ఆరుగురు కొత్త న్యాయమూర్తులు రానున్నారు. ఈ మేరకు జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని కొలీజియం కేంద్రానికి సిఫారసు చేసింది. ఏపీకి ఇద్దరు, తెలంగాణకు నలుగురు కొత్త న్యాయమూర్తులు రానున్నారు. ఏపీలో న్యాయాధికారుల కోటా నుంచి ఇద్దరి పేర్లను సిఫారసు చేసింది. ఏపీ జ్యుడీషియల్ అకాడమీ డైరెక్టర్‌గా సేవలందిస్తోన్న న్యాయాధికారి అవధానం హరిహరనాథశర్మ, హైకోర్డు రిజిస్ట్రార్ జనరల్ (ఆర్‌జీ) పని చేస్తోన్న న్యాయాధికారి డాక్టర్ యడవల్లి లక్ష్మణరావు పేర్లు ఇందులో ఉన్నాయి.

వీరి పేర్లకు కేంద్రం ఆమోదముద్ర వేశాక ప్రధాని కార్యాలయం ద్వారా రాష్ట్రపతిని చేరతాయి. రాష్ట్రపతి ఆమోదిస్తే కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ జారీ చేస్తుంది. వీరిద్దరి నియామకంతో హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 30కి చేరుతుంది. మరో 7 జడ్జి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకుర్ నేతృత్వంలోని కొలీజియం.. వీరిద్దరి పేర్లతో పాటు మరో జిల్లా ప్రధాన న్యాయమూర్తి పేరును గతంలో సుప్రీంకోర్టుకు సిఫారసు చేసింది. సుప్రీం కొలీజియం నిర్ణయం తెలియాల్సి ఉంది.

హరిహరనాథ శర్మ – హరిహరనాథ శర్మ కర్నూలులోని ఉస్మానియా కళాశాలలో బీఎస్సీ చదివారు. నెల్లూరు వీఆర్ న్యాయ కళాశాలలో న్యాయశాస్త్రం అభ్యసించారు. 1994లో న్యాయవాదిగా బార్ కౌన్సిల్‌లో పేరు నమోదు చేసుకున్నారు. కర్నూలు జిల్లా కోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించారు. సీనియర్ న్యాయవాది రామకృష్ణారావు వద్ద వృత్తి మెలకువలు నేర్చుకున్నారు. 1998లో సొంతంగా ప్రాక్టీస్ ప్రారంభించారు. 2007 అక్టోబరులో జిల్లా జడ్జిగా ఎంపికయ్యారు. ఉమ్మడి ఏపీలోని పలు ప్రాంతాల్లో వివిధ హోదాల్లో న్యాయసేవలందించారు. 2017 – 18లో అనంతపురం జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా, 2020 – 22 విశాఖ పీడీజేగా పని చేశారు. 2022లో హైకోర్టు రిజిస్ట్రార్‌గా.. 2023 నుంచి ఏపీ జ్యుడీషియల్ అకాడమీ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు.

డాక్టర్ లక్ష్మణరావు – డాక్టర్ లక్ష్మణరావు నెల్లూరు వీఆర్ న్యాయ కళాశాలలో న్యాయశాస్త్రం చదివారు. క్రిమినల్ లా, కంపెనీ లాలో బంగారు పతకాలు సాధించారు. 2000లో న్యాయవాదిగా పేరు నమోదు చేయించుకున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాతో పాటు నెల్లూరు, కావలిలో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. 2014లో జిల్లా జడ్జిగా ఎంపికయ్యారు. ఈ పోటీ పరీక్షలో రాష్ట్ర మొదటి ర్యాంక్ సాధించారు. ఏలూరులో అదనపు జిల్లా జడ్జిగా తొలుత సేవలందించారు. తర్వాత ఏపీలోని పలు ప్రాంతాల్లో వివిధ హోదాల్లో న్యాయ సేవలందించారు. నాగార్జున వర్శిటీ నుంచి పీజీ పూర్తి చేసి 2 మెరిట్ సర్టిఫికెట్లు సాధించారు. ఏయూ వర్శిటీ నుంచి పీహెచ్‌డీ పట్టా పొందారు. 2021లో హైకోర్టు జ్యుడీషియల్ రిజిస్ట్రార్‌గా నియమితులయ్యారు. తర్వాత రిజిస్ట్రార్ జనరల్‌గా నియమితులై ప్రస్తుతం కొనసాగుతున్నారు.

తెలంగాణ నుంచి నలుగురు..

తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులుగా నలుగురి పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫారసు చేసింది. జిల్లా జడ్జిల కోటాలో సిటీ సివిల్ కోర్టు చీఫ్ జడ్జి రేణుక యారా, సిటీ సివిల్ స్మాల్ కాజెస్ కోర్టు చీఫ్ జడ్జి నందికొండ నర్సింగ్‌రావు, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఇ.తిరుమలాదేవి, హైకోర్టు రిజిస్ట్రార్ (పరిపాలన) బీఆర్ మధుసూదన్‌రావులను తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులుగా సుప్రీంకోర్టు కొలీజియం ఈ నెల 11న సిఫారసు చేసింది.

Related Posts
టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు
Yadagirigutta Devasthanam Board on the lines of TTD

హైదరాబాద్‌: తిరుమల తిరుపతి దేవస్థానాల తరహాలోనే యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు ఏర్పాటుకు త్వరితగతిన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ధర్మకర్తల మండలి ఏర్పాటుకు Read more

Diwali : దీపావళి రోజు మాత్రమే తెరుచుకునే ఆలయం ఎక్కడ ఉందో తెలుసా..?
hasanamba temple

దీపావళి (Diwali) రోజు మాత్రమే తెరుచుకునే ఆలయం (Temple) ఒకటి ఉందని మీకు తెలుసా..? అంతే కాదు ఆ ఆలయ తలుపులు ఏడాదికోసారి దీపావళికి.. ముందు మాత్రమే Read more

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారు
budget meeting of the Parliament has been finalized

న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. జనవరి 31వ తేదీన మొదలై ఫిబ్రవరి 13వ తేదీ వరకు తొలి విడత బడ్జెట్ సమావేశాలు ఉంటాయి. రెండవ Read more

పెరుగుతున్న సైబర్ నేరాలపై డీజీపీ ఆందోళన
DGP Dwaraka Tirumala Rao

దేశంలో పెరుగుతున్న సైబర్‌ నేరాలు దేశవ్యాప్త ట్రెండ్‌కు అద్దం పడుతుండడంపై ఆంధ్రప్రదేశ్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ (డీజీపీ) ద్వారకా తిరుమలరావు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *