నేడు ‘నేతన్నకు చేయూత’ నిధులు విడుదల

నేతన్నకు చేయూత పథకానికి సంబంధించిన నిధులను సీఎం రేవంత్ నేడు విడుదల చేయనున్నారు.దీంతో 36,133 మంది అర్హులకు లబ్దిచేకూరనుంది.ఐఐహెచ్‌టీ ప్రారంభోత్సవంలో భాగంగా ముఖ్యమంత్రి నిధులు విడుదల చేయనున్నారు. మూడేళ్ల కాల పరిమితి గల ఈ పథకం రెండో విడత 2021 సెప్టెంబర్ లో మొదలై 2024 ఆగస్టుతో ముగియనుంది. రికరింగ్ అకౌంట్లలో కార్మికుల జీతంలోని 8శాతం జమ చేస్తే ప్రభుత్వం దాదాపు రెట్టింపు ఇచ్చి మొత్తాన్ని మూడేళ్ల తర్వాత అందించడం జరుగుతోంది. IIHT ప్రారంభోత్సవంలో భాగంగా ఆయన నిధులు విడుదల చేస్తారు.

గత ప్రభుత్వం ప్రారంభించిన ఈ పథకాన్ని రేవంత్ సర్కార్ కొనసాగిస్తూ వస్తోంది. అయితే, ప్రభుత్వం ఆర్డర్లు లేకపోవడంతో నేత కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో బతుకమ్మ చీరల ఆర్డర్లకు సంబంధించి కార్మికులకు ప్రభుత్వం ఇంకా బిల్లులు చెల్లించాల్సి ఉందని కార్మికులు ఆరోపిస్తున్నారు.సత్వరమే బిల్లులు విడుదల చేయడమే కాకుండా ప్రభుత్వం తరఫున ఆర్డర్లు ఇచ్చితమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు.