బారా షహీద్ లో మొదలైన రొట్టెల పండగ

నెల్లూరు బారాషాహిద్ దర్గా రొట్టెల పండగ ఘనంగా ప్రారంభమైంది. ఐదు రోజులు పాటు జరగనున్న ఈ వేడుకకు తొలిరోజే భక్తులు భారీగా తరలివచ్చారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాలకు చెందినవారు రొట్టెల మార్పిడిలో పాల్గొన్నారు. తమ కోర్కెలు నెరవేరినవారు రొట్టెలను వదిలేస్తుండగా.. కోర్కెలు కోరుకునేవారు వాటిని తీసుకుంటున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా సుమారు 2 వేల మంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు.

బారా షహీద్ దర్గా ఇక్కడ ఇచ్చుపుచ్చుకునే రొట్టెలు కోర్కెలు తీరుస్తాయని భక్తుల విశ్వసం. ఏటా లక్షల మంది ఈ దర్గాని దర్శించుకుంటారు. ఇస్లామిక్ క్యాలెండరు ప్రకారం మొహరం మాసంలో కొత్త ఏడాది మొదలవుతుంది. ఈ నెలలో చంద్రవంక కనిపించించిన 11 వ రోజు నుంచి 5 రోజుల పాటు రొట్టెల పండగ జరుపుకోవడం ఆనవాయితీ. మొదట్లో ఈ పండగని 2 రోజుల పాటు జరుపుకునేవారు కానీ భక్తులు పెరగడం తో ఇప్పుడు ఐదు రోజుల పాటు ప్రభుత్వం నిర్వహిస్తుంది.

దేశవ్యాప్తం అయింది.పవిత్ర బారా షహీద్ దర్గా లో ఇచ్చే రొట్టెలని ప్రజలు చాలా పవిత్రంగా భావిస్తారు. భక్తి శ్రద్ధలతో స్వీకరిస్తారు. దర్గాకి వచ్చే భక్తుల కోర్కెలు తీరాలంటే రొట్టెలు పంచాలి. కోర్కెలు తీరినవాళ్లు కొత్తవారికి రొట్టెలు ఇవ్వాలి. ఇది రొట్టెల పండుగ ఆచారం. ఇలా మొదలైన రొట్టెల పండుగ ప్రస్తుతం అనేక మంది భక్తులని ఆకర్షిస్తుంది. దర్గా దేగ్గెర ఉత్సవం లో పాల్గొనటానికి ప్రస్తుతం దేశం నలుమూలలు నుంచి వస్తున్నారు. ఈ పండగలో వివిధ ఆచారాలు వున్నాయి. గోధుమ పిండితో తాయారు చేసిన రొట్టెలను, బెల్లం తో పాటు దర్గా లోని సమాధుల దెగర పెట్టాలి. ఆ తరువాత పక్కనే వున్న చెరువు దెగరకి వెళ్లి నీళ్లను తలపై చల్లుకుని కోర్కెలు నెరవేరాలని వేడుకుంటారు. ఆ తరువాత చుట్టూ ప్రక్కన వాళ్ళ రొట్టెలు పంచుతారు. ఒక కోర్కెకు 5 రొట్టెలు పంచాలి అనేది ఇక్కడి ఆచారం. సాధ్యమైనంత వరకు ఇంటి వద్దానే తాయారు చేసుకుని రావాలి. అయితే దూరప్రాంతాల నుంచి వచ్చే వారి కోసం చెరువు వద్దే రొట్టెలు చేసి అముతుంటారు. ఈ దర్గా కి వచ్చిన భక్తులు మల్లి వస్తే వేరే కొత్త భక్తుడిని వెంట తీసుకువెళ్లాలి.