బ్రెజిల్‌లో జరిగిన వేలంలో నెల్లూరు జాతి ఆవు కనకవర్షం కురిపించింది. 4.8 మిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో చెప్పాలంటే దాదాపు రూ. 40 కోట్లకు అమ్ముడుపోయి ఏకంగా గిన్నిస్ రికార్డులకెక్కింది. బ్రెజిల్‌లోని మినాస్ గెరైస్‌లో నిర్వహించిన వేలంలో నెల్లూరు జాతికి చెందిన వియాటినా-19 అనే ఆవును వేలం వేయగా ఓ వ్యక్తి దానిని ఈ మొత్తానికి సొంతం చేసుకున్నాడు. దీని బరువు ఏకంగా 1,101 కిలోలు. ఇదే జాతికి చెందిన ఆవులతో పోలిస్తే ఇది రెట్టింపు బరువు.

అత్యధిక ధర పలికిన వియాటినా-19 గోవుగా రికార్డులకెక్కిన ఈ ఆవు..ఇది ‘చాంపియన్స్ ఆఫ్ ది వరల్డ్’లో ‘మిస్ సౌత్ అమెరికా’ అవార్డు అందుకుంది.ఇవే ఆవులను మనం ఒంగోలు జాతిగా పిలుస్తుంటాం. ఇవి అధిక ఉష్ణోగ్రతలను సైతం తట్టుకుని మనుగడ సాగించగలవు. 1800 సంవత్సరాల్లో ఈ జాతి ఆవులు బ్రెజిల్‌కు ఎగుమతి అయ్యాయి. వీటిలో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది.