దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగాల కోసం పోటీపడే నిరుద్యోగులకు ముఖ్యమైన పరీక్షల్లో ఒకటైన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (IBPS) ప్రొబేషనరీ ఆఫీసర్ (PO) ప్రిలిమ్స్ 2025 రాత పరీక్షలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఐబీపీఎస్ అధికారిక వెబ్‌సైట్‌లో అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. దరఖాస్తు చేసిన అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, రోల్ నంబర్, పాస్‌వర్డ్ లేదా పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. హాల్ టికెట్ లేకుండా పరీక్ష కేంద్రంలో ప్రవేశం లేదు కాబట్టి ప్రతి అభ్యర్థి తప్పనిసరిగా దానిని తీసుకెళ్లాలి.ఈ ఏడాది ఐబీపీఎస్ పీవో ప్రిలిమ్స్ పరీక్షలు ఆగస్టు 17, 23, 24 తేదీల్లో దేశవ్యాప్తంగా వందలాది పరీక్షా కేంద్రాల్లో నిర్వహించబడతాయి. ఈ పరీక్షలు పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో (కంప్యూటర్ ఆధారిత పరీక్ష) జరుగుతాయి. ప్రతి అభ్యర్థికి వేరువేరు ప్రశ్నాపత్రం సిస్టమ్ ద్వారా రూపొందించబడుతుంది.
Read hindi news: hindi.vaartha.com
Read also: