Goa Fire Accident : గోవా అగ్నిప్రమాదం.. పరిహారం ప్రకటించిన సీఎం

గోవా రాజధాని పనాజీ సమీపంలోని ఒక నైట్ క్లబ్‌లో జరిగిన ఘోర అగ్నిప్రమాదం రాష్ట్రంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ దారుణ ఘటనలో మొత్తం 25 మంది మరణించగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు నష్టపరిహారాన్ని ప్రకటించారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం తరఫున ఒక్కొక్కరికి రూ. 5 లక్షల చొప్పున పరిహారం అందించనున్నట్లు సీఎం సావంత్ తెలిపారు. … Continue reading Goa Fire Accident : గోవా అగ్నిప్రమాదం.. పరిహారం ప్రకటించిన సీఎం