జులై 04 న దేశవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌

పేపర్‌ లీకేజీలను నిరసిస్తూ జూలై 4న దేశవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌కు ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్‌, పీడీఎస్‌యూ తదితర వామపక్ష విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. పరీక్షల నిర్వహణలో విఫలమైన ఎన్‌టీఏ ను రద్దు చేయాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలని విద్యార్థి సంఘాలు పట్టుబడుతున్నాయి.

ఇవే డిమాండ్‌లతో జులై 4న దేశ వ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చాయి. బంద్‌కు విద్యా సంస్థల యాజమాన్యాలు సహకరించాలని కోరాయి. మరోవైపు నీట్‌ అక్రమాలను నిరసిస్తూ మంగళవారం విద్యార్థి సంఘాలు పార్లమెంట్‌ మార్చ్‌ చేపట్టనున్నాయి.జంతర్‌ మంతర్‌ వద్ద విద్యార్థుల నిరవధిక నిరసనలు సోమవారం 6వ రోజుకు చేరుకున్నాయి.