మస్తాన్ సాయి అరెస్టు వ్యవహారంలో కీలక పరిణామం

మస్తాన్ సాయి కేసులో నార్కోటిక్ పోలీసులు

రాజ్ తరుణ్, లావణ్య కేసుతోపాటు యువతుల ప్రైవేటు వీడియోలను సేకరించి బెదిరింపులకు పాల్పడుతున్న మస్తాన్ సాయి అరెస్టు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో యాంటీ నార్కోటిక్స్ పోలీసులు రంగంలోకి దిగారు. ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. మస్తాన్‌సాయి డ్రగ్స్ దందా గురించి యాంటీ నార్కోటిక్స్ పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే కీలక ఆధారాలు సేకరించారు. టాస్క్‌ఫోర్స్‌తో కలిసి సైబరాబాద్ నార్కోటిక్ బ్యూరో పనిచేస్తోంది.

mastansai

లావణ్య ఫిర్యాదుతో పోలీసులు మస్తాన్‌సాయిని అరెస్ట్ చేశారు. నార్సింగి పోలీసులు అతడిని ఏడు రోజుల కస్టడీకి కోరారు. ఈ విచారణలో తెలంగాణ న్యాబ్ పోలీసులు పాల్గొననున్నారు. మరోవైపు, మస్తాన్‌సాయి నిర్వహించిన డ్రగ్స్ పార్టీల్లో పాల్గొన్న వారికి అధికారులు నోటీసులు ఇవ్వనున్నారు.మస్తాన్ సాయి డ్రగ్ పార్టీ వీడియోలో ఉన్న వారందరూ పరారయ్యారు. మస్తాన్ సాయి కేసులో నార్కోటిక్ పోలీసులు నిఘా పెంచారు. యువతులను ట్రాప్ చేసి వారి నగ్న వీడియోలు చిత్రీకరించిన తర్వాత వాళ్లను బ్లాక్‌మెయిల్‌కు పాల్పడ్డాడంటూ లావణ్య ఇచ్చిన ఫిర్యాదుతో మస్తాన్ సాయిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. మస్తాన్ సాయి ఇంట్లో జరిగిన పార్టీలకు సంబంధించిన వీడియోలో బయటకు వచ్చాయి. అందులో చాలా మంది యువతీయువకులు పార్టీలో డ్రగ్స్ తీసుకుంటున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో నార్కోటిక్ పోలీసులు డ్రగ్స్ వ్యహారంపై రంగంలోకి దిగారు. డ్రగ్స్‌ను ఎక్కడి నుంచి తీసుకువస్తున్నారనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మరోవైపు మస్తాన్ సాయిని కస్టడీకి కోరుతూ నార్సింగి పోలీసులు పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఈరోజు మధ్యాహ్నం తీర్పు వెల్లడించే అవకాశం ఉంది. మస్తాన్ సాయిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తే అసలు వాస్తవాలు బయటపడతాయని పోలీసులు భావిస్తున్నారు.

Related Posts
ప్రభాస్ సరసన సందీప్ రెడ్డి వంగా ప్లాన్
spirit

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న స్పిరిట్ సినిమా మీద అంచనాలు తారాస్థాయికి చేరాయి. ఇటీవల విడుదలైన Read more

న్యూస్ పేపర్ ప్రింటెడ్ డ్రెస్‌లో కరీనా
న్యూస్ పేపర్ ప్రింటెడ్ డ్రెస్‌లో కరీనా

న్యూస్ పేపర్ ప్రింటెడ్ డ్రెస్‌లో కరీనా బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందం, అభినయం కలిసిన ఈ ముద్దుగుమ్మకు విపరీతమైన Read more

హీరో మంచు విష్ణుకు ఉపశమనం.. ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు
Manchu Vishnu.jpg

ఇటీవల సోషల్ మీడియా వేదికగా కొన్ని ఆకతాయిలు సెలబ్రిటీలకు చెడ్డ పేరు తెచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు. వీరు ముఖ్యంగా వ్యూస్ కోసం అవహేళన చేస్తూ తప్పుడు వీడియోలు Read more

వివేకానంద వైరల్ మూవీ రివ్యూ..
మూవీ రివ్యూ..

ఆహ లో విడుదలవుతున్న మలయాళ సినిమా 'వివేకానందన్ వైరల్'. మలయాళంలో క్రితం ఏడాది జనవరి 19వ తేదీన విడుదలైంది. షైన్ టామ్ చాకో కథానాయకుడిగా నటించాడు. ఈ Read more