నరసాపురం ఎంపీడీవో వెంకటరమణ మృతి

అదృశ్యమైన నరసాపురం ఎంపీడీవో వెంకటరమణ మృతిచెందారు. ఆయన మృతదేహం ఏలూరు కాలువలో లభ్యమైంది. నర్సాపురంలో ఎంపీడీవోగా పనిచేస్తున్న ఆయన సెలవు రోజుల్లో విజయవాడలోని ఇంటికి వస్తుంటారు. ఈ నెల 10 నుంచి 20వ తేదీ వరకు సెలవు పెట్టి కానూరు వచ్చారు. 15న మచిలీపట్నంలో పని ఉందంటూ ఇంట్లో చెప్పి వెళ్లిన వెంకటరమణ.. అదే రోజు రాత్రి 10 గంటలకు ఫోన్ చేసి తాను బందర్‌లో ఉన్నానని ఇంటికి రావడం ఆలస్యమవుతుందని తెలిపారు. తర్వాత ఆయన ఆచూకి తెలియకపోగా ఫోన్ కూడా పనిచేయలేదు. అదే రోజు అర్థరాత్రి దాటిన తర్వాత తన పుట్టిన రోజు.. చనిపోయే రోజని అందరూ జాగ్రత్త అని భార్య ఫోన్‌కు మెసేజ్ పంపించారు.

8 రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిన ఆయన.. బోటింగ్ కాంట్రాక్టర్ రూ.55 లక్షలు చెల్లించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ ఒత్తిడితో సూసైడ్ చేసుకుంటున్నట్లు కుటుంబసభ్యులకు మెసేజ్ పంపారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ జోక్యం చేసుకోవడంతో ఆయన మిస్సింగ్ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అంత ఈయన రాష్ట్రం వదిలి ఎక్కడికో వెళ్లాడని అనుకున్నారు కానీ ఈరోజు మృతదేహం లభ్యం కావడం తో ఆయన కుటుంబంలో విషాద ఛాయలు అల్లుకున్నాయి.