Nara Lokesh Sensational Comments ON YS Jagan

జగన్ పాలనలో వెలువడిన చీకటి జీవోలుకాదు కూటమి ప్రభుత్వానివి: లోకేశ్‌

అమరావతి: ఇకనైనా జగన్‌ తప్పుడు ప్రచారాలు మానుకోవాలని మంత్రి నారా లోకేశ్‌ తెలిపారు. ఈమేరకు ఆయన ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. ”వరద బాధితులకు ఇస్తామన్న రూ.కోటిలో ఒక్క రూపాయి ఇప్పటికీ ఇవ్వలేదు ఫేక్ జగన్. ఒక వాటర్ ప్యాకెట్, ఒక బిస్కెట్ ప్యాకెట్ కూడా పంపిణీ చేయని ఆయన.. వరద సహాయక చర్యలపై విషం కక్కుతున్నారు. వరద ప్రాంతాల్లో కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలకు రూ.23 కోట్లు అంటూ ఫేక్ ప్రచారం చేయిస్తున్నారు. వీటికి ఖర్చు రూ.23 లక్షలు కూడా కాలేదు.

జగన్ పాలనలో వెలువడిన చీకటి జీవోలు, చీకటి లెక్కలు కాదు కూటమి ప్రభుత్వానివి. మా ప్రభుత్వం లెక్కలు అన్నీ పారదర్శకంగా ఉన్నాయి. ఇందుకు సంబంధించి ‘ఎక్స్‌’లో పోస్టు పెట్టాం. చదువు వస్తే చదువుకో.. కళ్లుంటే చూడు. తాడేపల్లి ప్యాలెస్ కలుగులో దాక్కుని ఎగ్‌ పఫ్‌ల పేరుతో జగన్‌ ప్రజాధనం రూ.కోట్లు మెక్కారు. ఫేక్ జగన్ ఇకనైనా నీ ఫేక్ ప్రచారాలు ఆపు” అని లోకేశ్‌ విమర్శించారు.

Related Posts
అంజీర్ పండ్లను రాత్రి నానబెట్టి తింటే కలిగే లాభాలు
health benefits of anjeer f

ఆరోగ్య నిపుణులు ప్రకారం, అంజీర్ పండ్లను రాత్రి నానబెట్టి ఉదయం తినడం శరీరానికి అనేక రకాల లాభాలను అందిస్తుంది. ఈ పండ్లను తేనెతో కలిపి పరగడుపున తింటే Read more

కాంగ్రెస్ పాలనలో అవినీతి పెరిగింది: రాజాసింగ్
కాంగ్రెస్ పాలనలో అవినీతి పెరిగింది రాజాసింగ్1

గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే టి రాజాసింగ్ తెలంగాణలో అవినీతి పెరుగుదలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అవినీతి పరిస్థితి Read more

ఫార్ములా ఈ రేసుపై నేటి నుండి ఈడీ విచారణ
enforcement directorate investigation will start from today on this formula race

హైదరాబాద్‌: ఫార్ములా ఈ రేసుపై నేటి నుంచి ఈడీ విచారణ షురూ కానుంది. ఈ నేపథ్యంలో ఫార్ములా ఈ రేసు కేసుతో సంబంధం ఉన్న వారిని ఒక్కొక్కరిగా Read more

ఆదానీ గ్రూప్ పై అవినీతి ఆరోపణలపై JPC విచారణను కోరిన కాంగ్రెస్ ఎంపీ
sayyad hussain

కాంగ్రస్ ఎంపీ డా. సయద్ హుస్సేన్, గౌతమ్ ఆదానీ మరియు ప్రధాన మంత్రి మోదీపై తీవ్రమైన ఆరోపణలు చేసినారు. ఆయన మాట్లాడుతూ, NITI ఆయోగ్ నియమాల ప్రకారం Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *