పరదాల సీఎం కాదు.. ప్రజా సీఎం ను చూస్తున్నారు – లోకేష్

కూటమి ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు పింఛన్ రూ. 4వేలతో పాటు.. గత మూడు నెలలకు సంబంధించిన రూ.3వేలు మొత్తం రూ. 7వేల పింఛన్ ను అర్హులైన లబ్ధిదారులకు రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అందిస్తున్నారు. మంగళగిరి నియోజకవర్గం పెనుమాక గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని నారా లోకేష్ తో కలిసి సీఎం చంద్రబాబు ప్రారంభించారు.

ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమం మంగళగిరిలో శ్రీకారం చుట్టడం ఆనందంగా ఉందని, మంగళగిరి ప్రజా సమస్యలు త్వరగా పరిష్కరించాలని ముఖ్యమంత్రికి నివేదించారు. సీడ్ యాక్సిస్ రహదారి పూర్తి, అమరావతి నిర్మాణంలోనూ మంగళగిరి ప్రజలు ప్రభుత్వం వెన్నంటే ఉంటారని, మంగళగిరి నియోజకవర్గ ప్రజలు రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత తనపై ఉన్నందున అందుకు సహకరించాలని సీఎం చంద్రబాబును లోకేష్ కోరారు. గత అయిదేళ్ళు పరదాల సీఎంను చూశామని, ఇప్పుడు ప్రజా ముఖ్యమంత్రిని చూస్తున్నామని అన్నారు.