lokesh dakumaharaj

మామ సినిమా కోసం రంగంలోకి దిగుతున్న అల్లుడు

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ తెరకెక్కిస్తోన్న ‘డాకు మహారాజ్‘ సినిమా నుంచి కీలక అప్డేట్ వచ్చింది. డాకు మహారాజ్ సినిమా సంక్రాంతి 2025 కి రాబోతున్న సంగతి తెలిసిందే. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్‌ విజయాలను సొంతం చేసుకుని హ్యాట్రిక్ సాధించిన బాలకృష్ణ డాకు మహారాజ్‌తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకోబోతున్నారు అని అభిమానులు బలంగా నమ్ముతున్నారు. ఈ సినిమాలో శ్రద్దా శ్రీనాథ్‌ కీలక పాత్రలో నటిస్తుండగా, ప్రగ్యా జైస్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. తమన్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే సినిమా తాలూకా సాంగ్స్, టీజర్స్ , ప్రమోషన్స్ సినిమా పై అంచనాలు పెంచేయగా…ఇప్పుడు మరో వార్త అభిమానులకు కిక్ ఇస్తుంది.

‘డాకు మహారాజ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ రేపు అనంతపురంలో అట్టహాసంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకకు మంత్రి నారా లోకేశ్ హాజరవుతారని టీడీపీ నాయకులు తెలిపారు. అనంతపురంలో బాలయ్య వైబ్ చూడబోతున్నాం అని ఇప్పటికే మూవీ టీం ప్రకటించింది. ఇక ఈవెంట్ కు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ‘డాకు మహారాజ్’ ఈ నెల 12న విడుదల అవుతున్న విషయం తెలిసిందే. డాకు మ‌హారాజ్ త‌ర్వాత బోయ‌పాటి శ్రీనుతో అఖండ 2 మూవీ చేయ‌బోతున్నాడు బాల‌కృష్ణ‌. అఖండ‌కు సీక్వెల్‌గా ఈ మూవీ తెర‌కెక్కుతోంది. ఇటీవ‌లే పూజా కార్య‌క్ర‌మాల‌తో అఖండ 2 మొద‌లైంది. ఈ సినిమాకు బాల‌కృష్ణ కూతురు తేజ‌స్విని ప్ర‌జెంట‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తోంది.

Related Posts
మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డికి తప్పిన ప్రమాదం
Accident in Minister Uttam Kumar Chonvoy in Garidepalle in Suryapet

హుజూర్‌నగర్‌: తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాన్వాయ్ శుక్రవారం ప్రమాదానికి గురైంది. ఉత్తమ్ తన నియోజకవర్గమైన హుజూర్ నగర్ నుంచి జాన్ పహాడ్ ఉర్సు ఉత్సవాలకు Read more

నేడు “సీ ప్లేన్‌”ను ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు
CM Chandrababu

విజయవాడ: నేడు సీఎం చంద్రబాబు , కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు , ఇతర అధికారులు కలిసి విజయవాడ - శ్రీశైలం మధ్య Read more

YS Vivekananda: మా నాన్న కేసులో సాక్షులు చనిపోవడం అనుమానాస్పదమే : సునీత
deaths of witnesses in my father case are suspicious: Sunitha

YS Vivekananda : వైఎస్‌ వివేకా కేసులో ఉన్న సాక్షులు చనిపోవడంపై వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. మా నాన్న కేసులో Read more

ప్రముఖ నటుడు ముస్తాక్ ఖాన్ కిడ్నాప్
Mushtaq Khan kidnap

ప్రముఖ నటుడు ముస్తాక్ ఖాన్ కిడ్నాప్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 'స్త్రీ-2', 'వెల్కమ్' వంటి చిత్రాల్లో తన నటనతో గుర్తింపు పొందిన ఆయనను దుండగులు గతనెల Read more