‘నువ్వే నా సర్వస్వం..’ భార్య భువనేశ్వరికి చంద్రబాబు విషెస్

నారా భువనేశ్వరి పుట్టిన రోజు ఈరోజు. ఈ సందర్భాంగా నారా వారి ఫ్యామిలీ సభ్యులతో పాటు నందమూరి కుటుంబ సభ్యులు , టీడీపీ నేతలు , శ్రేణులు పెద్ద ఎత్తున ఆమెకు బర్త్ డే విషెష్ తెలియజేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఆమె భర్త , ఏపీ సీఎం చంద్రబాబు ప్రత్యేక విషెష్ తెలియజేసారు.

‘ఎప్పుడూ మద్ధతుగా, ధైర్యంగా, చీకటి రోజుల్లో సైతం చిరునవ్వుతో ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంలో 100 శాతం తోడ్పాటునందించే భువనేశ్వరికి జన్మదిన శుభాకాంక్షలు.. నువ్వే నా సర్వస్వం..’ అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. దీనికి భువనేశ్వరి ట్విట్టర్ వేదికగానే రిప్లై ఇచ్చారు. థాంక్యూ అండి.. మీరే నాకు స్ఫూర్తి.. ఆంధ్రప్రదేశ్ ఫ్యామిలీ కోసం అంకితభావంతో పనిచేసే మీకు ఎప్పటికి మద్దుతుగానే ఉంటాను… అని చంద్రబాబు ట్వీట్‌కు బదులిచ్చారు.

Always supportive and strong, always smiling even during the darkest days, always giving her 100 percent to help me pursue my passion to serve people… Happy Birthday Bhuvaneswari, my everything!@ManagingTrustee pic.twitter.com/r8LOSCoWY1— N Chandrababu Naidu (@ncbn) June 20, 2024