ప్రపంచ ప్రసిద్ధి చెందిన తమ పెరి-పెరి రుచినిహైదరాబాద్‌కు తీసుకువస్తున్న నాండోస్

Nando’s brings its world famous Peri-Peri flavor to Hyderabad

హైదరాబాద్: తన ప్రత్యేకమైన ఫ్లేమ్-గ్రిల్డ్ పెరి-పెరి చికెన్ కు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రియమైన దక్షిణాఫ్రికా రెస్టారెంట్ బ్రాండ్ నాండోస్ హైదరాబాద్‌లోని RMZ నెక్సిటీలో ప్రారంభమ వుతోంది. ఈ అందమైన న్యూ కాసా (పోర్చుగీస్‌లోని రెస్టారెంట్) నవాబుల నగరంలోకి నాండోస్ ప్రవేశించడాన్ని సూచిస్తుంది. “ఆహార వైవిధ్యం, మసాలాల పట్ల ప్రేమకు ప్రసిద్ధి చెందిన హైదరాబాద్‌కు మా ప్రపంచ ప్రఖ్యాత పెరి-పెరి రుచు లను తీసుకురావడానికి మేం సంతోషిస్తున్నాం. భారత్ లో మా ఉనికిని పెంచుకుంటూ పోతున్నందున ఈ ప్రారం భం మాకు మైలురాయి” అని నాండోస్ ఇండి యా సీఈఓ సమీర్ భాసిన్ అన్నారు. “మా ప్రామాణిక రుచులు దక్షిణాఫ్రికాలో పుట్టాయి కానీ భారతదేశంలోని మసాలాప్రియుల కోసం రూపొందించబడ్డాయి. పెరి-పెరి – ఆఫ్రికన్ బర్డ్స్ ఐ చిల్లీతో తయారు చేయబడింది – ఇది నాండోస్ అనుభవానికి గుండెకాయ. మా సాస్‌లు, బేస్టింగ్‌లు, మెరినేడ్స్ అన్నీ తాజా, అసలైన పదార్థాలతో తయారు చేయబడ్డాయి. కృత్రిమ రుచులు లేదా రంగులు లేవు. మేం ఫ్లేమ్-గ్రిల్ చేస్తాం, ఎందుకంటే ఇది చాలా రుచిగా ఉంటుంది. కొవ్వు పదార్థాన్ని తగ్గిస్తుంది. రెగ్యులర్ బేస్టింగ్ అనేది దానిని చాలా రసవంతంగా ఉంచుతుంది. పెరి-పెరితో ఫైనల్ బేస్టింగ్ కస్టమర్ ఇష్టపడే వేడి స్థాయికి అనుకూలీకరించబడుతుంది.

అదే మా చికెన్‌ ప్రత్యేకత. నాండోస్ ప్రేమికులు ఇప్పుడు హైదరాబాద్‌లోని ఆర్ఎం జెడ్ నెక్సిటీలో ఉన్న మా కొత్త కాసాలో లెజెండరీ ఫ్లేమ్-గ్రిల్డ్ పెరి-పెరి చికెన్‌ని ఆస్వాదించవచ్చు’’ అని అన్నారు. ఆఫ్రికా కొన నుండి భారతదేశానికి, వైవిధ్యభరితమైన భూమికి ఈ సంస్థ ప్రయాణం ఒక సాహసం. ఇది 36 సంవత్సరాల క్రితం దక్షి ణాఫ్రికా లోని జోహాన్స్ బర్గ్‌లోని ఒకే ప్రదేశంతో ప్రారంభమైంది – ఇప్పుడు 5 ఖండాలలోని 24 దేశాలలో విస్తరించి ఉంది. జోహాన్స్ బ ర్గ్ నుండి లండన్, షికాగో, సిడ్నీ, కౌలాలంపూర్ మరియు ఇప్పుడు హైదరాబాద్ వరకు, నాండోస్ ఎప్పుడూ వేడి వేడి పదార్థాలని తె స్తుంది. నాండోస్ కొత్త కాసా ఆర్ఎంజెడ్ నెక్సిటీ హైదరాబాద్‌లోని హైటెక్‌సిటీలో ఒక ప్రధాన కార్పొరేట్ హబ్‌లో ప్రారంభించబడింది. రెస్టారెంట్ అసలైన, సమ కాలీన దక్షిణ ఆఫ్రికా కళలు, ఫర్నిచర్‌ను కలిగి ఉంది. 2088 చ. అడుగుల నాండోస్ దాదాపు 74 మంది కస్టమ ర్లకు డైన్-ఇన్ సీటింగ్‌ను అందిస్తుంది. సోమవారం నుండి ఆదివారం వరకు ఉదయం 11:30 నుండి రాత్రి 11:30 గంటల వరకు.

ఏమిటి: హైదరాబాద్‌లోని RMZ, నెక్సిటీలో నాండోస్ ప్రారంభోత్సవం
ఎక్కడ: RMZ నెక్సిటీ, గ్రౌండ్ ఫ్లోర్, టవర్ 30. నాలెడ్జ్ సిటీ, హైదరాబాద్, తెలంగాణ 500081
ఎప్పుడు: సెప్టెంబర్

నాండోస్ పెరి-పెరి గురించి:
దక్షిణాఫ్రికాలోని జోహాన్స్ బర్గ్‌లో 1987లో అరంగేట్రం చేసిన తర్వాత, నాండోస్ ఐదు ఖండాల్లోని 24 దేశాలలో అభిమానులకు తన రుచులను వ్యాపింపజేసింది. విశ్వాసపాత్రులైన అభిమానులందరూ ఒకే అనుభూతిని పంచుకుంటారు – ఈ రసవంతమైన పెరి-పెరి చికెన్ ఆకర్షణను వారు అడ్డుకోలేరు – 24 గంటల పాటు మెరినేట్ చేసి, ఫ్లేమ్-గ్రిల్ చేసి, మీరు ఇష్టపడే హీట్ లెవెల్‌కు అనుగుణంగా దీన్ని తయారు చేస్తారు. శతాబ్దాల క్రితం ఆఫ్రికా పోర్చుగీస్‌కు పరిచయం చేసిన ఆఫ్రికన్ బర్డ్స్ ఐ చిల్లీతో తయారు చేయబడిన – ఫైరీ పెరి-పెరి రుచికి కూడా రెస్టారెంట్ ఎంతగానో ప్రసిద్ధి చెందింది. నాండోస్ 2013లో భారత మార్కెట్లోకి ప్రవేశించింది. ఇప్పుడు దిల్లీ ఎన్సీఆర్, బెంగళూరు, చండీగఢ్‌లలో 10 రెస్టారెంట్లను నిర్వహిస్తోంది.