Nandigam Suresh surrendered in court

కోర్టులో లొంగిపోయిన నందిగం సురేశ్

అమరావతి ఉద్యమం సమయంలో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించారనే కేసు

అమరావతి : వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ మళ్లీ జైలుకు వెళ్లనున్నారు. ఓ కేసు విషయంలో పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో కోర్టులో లొంగిపోయిన ఆయనకు న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించారు. అమరావతిలో ఓ మహిళపై దౌర్జన్యం చేశారని నందిగం సురేశ్ పై కేసు నమోదైంది. అయితే ఈ కేసులో పోలీసుల చర్యలకు ముందుగానే మాజీ ఎంపీ సురేశ్ కోర్టులో లొంగిపోయారు. కోర్టులో లొంగిపోతే బెయిల్ వస్తుందన్న ఆలోచనతో ఆయన రాగా, న్యాయమూర్తి అనూహ్యంగా రిమాండ్ విధించినట్లు చెబుతున్నారు.

కోర్టులో లొంగిపోయిన నందిగం సురేశ్

అప్పట్లో కేసు నమోదు చేసినా… అరెస్టులు చేయని పోలీసులు

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మాజీ ఎంపీ సురేశ్ పై వరుస కేసులు నమోదవుతున్నాయి. మంగళగిరిలో పార్టీ కార్యాలయంపై దాడి కేసులో తొలుత అరెస్టు అయిన సురేశ్ జైలుకు వెళ్లారు. ఆ కేసులో బెయిల్ వచ్చిన వెంటనే 2020లో వెలగపూడిలో చోటుచేసుకున్న ఓ హత్యకేసులో మాజీ ఎంపీని అరెస్టు చేశారు. దీంతో ఈ కేసులో బెయిల్ వచ్చేవరకు ఆయన 145 రోజులు రిమాండ్ ఖైదీగా జైలు జీవితం గడిపారు.

ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన సురేశ్ తరపు న్యాయవాదులు

వెలగపూడికి చెందిన మరియమ్మ హత్యకేసులో బెయిల్ వచ్చిన నందిగం సురేశ్ జనవరి 30న విడుదలయ్యారు. దాదాపు 17 రోజులుగా బయటే ఉన్న ఆయనపై తాజాగా అమరావతికి చెందిన మహిళ ఫిర్యాదు చేయడంతో మళ్లీ జైలుకు వెళ్లాల్సివచ్చిందంటున్నారు. అయితే ఈ కేసులో పోలీసు చర్యలకు ముందే ఆయన కోర్టులో లొంగిపోవడం గమనార్హం. మరోవైపు ముందస్తు బెయిల్ కోసం సురేశ్ తరపు న్యాయవాదులు యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.

Related Posts
ఏపీకి వెళ్లిన ఐఏఎస్‌ల స్థానంలో ఇంఛార్జ్‌ల నియామకం
incharge ias in telangana

తెలంగాణ నుంచి రిలీవ్ అయిన పలువురు IAS అధికారుల స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం ఇంఛార్జులను నియమించింది. ఇటీవల డీవోపీటీ తెలంగాణ కేడర్‌లో కొనసాగుతున్న ఐఏఎస్‌లను ఏపీకి, ఏపీలో Read more

Betting: పరారీలో సెలబ్రిటీలు పోలీసుల అనుమానాలు
Betting: పరారీలో సెలబ్రిటీలు పోలీసుల అనుమానాలు

బెట్టింగ్‌ ప్రమోషన్‌లపై ఉక్కుపాదం తెలంగాణలో ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రభావం గణనీయంగా పెరుగుతోంది. గత ఒక సంవత్సరంలో బెట్టింగ్ కారణంగా 15 మంది యువత ఆత్మహత్య చేసుకున్నట్లు Read more

సౌతిండియా అఖిలపక్ష సమావేశానికి జగన్‌కు ఆహ్వనం
Jagan invited to South India all party meeting

అమరావతి: తమిళనాడు మంత్రి ఈవీ వేలు, డీఎంకే రాజ్యసభ సభ్యుడు విల్సన్ బుధవారం వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ను కలిశారు. ఈ మేరకు వారు ఈ నెల Read more

మల్లన్నకు వారం రోజులు టైం ఇచ్చిన టీపీసీసీ
mlc teenmar mallanna1.jpg

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఒక కులాన్ని దూషించడం, కులగణన నివేదికను దహనం చేయడంపై పార్టీ Read more