వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ అరెస్ట్

మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్ను పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్లో ఉన్న ఆయనను అర్ధరాత్రి అదుపులోకి తీసుకుని ఏపీకి తరలించారు. హైద‌రాబాద్‌లో ఉన్న ఆయ‌న‌ను అరెస్ట్ చేసి ఏపీకి త‌ర‌లిస్తున్న‌ట్లు స‌మాచారం. కాగా, ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం సురేశ్ దాఖ‌లు చేసిన పిటిష‌న్‌ను హైకోర్టు కొట్టివేసిన విష‌యం తెలిసిందే.

దీంతో తుళ్లూరు పోలీసులు బుధ‌వారం సురేశ్‌ను అరెస్ట్ చేసేందుకు ఉద్దండ‌రాయునిపాలెంలోని ఆయ‌న నివాసానికి వెళ్లారు. అయితే, అరెస్టుపై స‌మాచారంతో ఆయ‌న త‌న ఫోన్ స్విచాఫ్ చేసి, అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దాంతో పోలీసులు కొంత సేప‌టి వ‌ర‌కు వేచి చూసి అక్క‌డి నుంచి వ‌చ్చేశారు.

ఆ త‌ర్వాత సెల్‌ఫోన్ సిగ్న‌ల్స్ ఆధారంగా సురేశ్ బుధ‌వారం ఉద‌యం నుంచి ఎక్క‌డ ఉన్నారో పోలీసులు విచార‌ణ చేప‌ట్టారు. దాంతో పోలీసులకు ఆయ‌న హైద‌రాబాద్ నుంచి పారిపోయేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు తెలిసింది. వెంట‌నే హైద‌రాబాద్ వెళ్లిన ప్ర‌త్యేక బృందం సురేశ్‌ను అదుపులోకి తీసుకున్న‌ట్లు స‌మాచారం.