Muslim Bharatanatyam artist

హిందూ ఆలయానికి ముస్లిం భక్తుడి గిప్ట్..

హిందూ ఆలయానికి ముస్లిం భక్తుడు భారీ గిఫ్ట్ అందజేసి వార్తల్లో నిలిచాడు. మనసున్న భక్తుడికి మతం పెద్దది కాదు..అని జహీర్ హుస్సేన్ అనే వ్యక్తి నిరూపించాడు. తమిళనాడులోని తిరుచ్చిలో ప్రసిద్ధమైన శ్రీరంగం రంగనాథ స్వామి ఆలయానికి విలువైన బహుమతిని అందజేశారు. 600 వజ్రాలతో ప్రత్యేకంగా రూపొందించిన కిరీటాన్ని సమర్పించి.. మత సామరస్యాన్ని చాటుకున్నారు. జహీర్ హుస్సేన్ భరతనాట్య కళాకారుడిగా సుపరిచితుడు. తన నాట్య ప్రదర్శనల ద్వారా సంపాదించిన డబ్బులను దాచుకుని, శ్రీరంగం రంగనాథ స్వామి కోసం ఈ ప్రత్యేకమైన కిరీటాన్ని తయారు చేయించారు. ఈ కిరీటంలో 3169 క్యారెట్ల బరువున్న ఒకే రూబీ రాయి ప్రధాన ఆకర్షణగా ఉంది. ఈ కిరీటాన్ని తయారు చేయడానికి 8 ఏళ్ల సమయం పట్టిందని జహీర్ వెల్లడించారు.

Advertisements

శ్రీరంగం రంగనాథ స్వామి ఆలయ ప్రధాన అర్చకుడు సుందర్ భట్టర్‌కు జహీర్ హుస్సేన్ ఈ కిరీటాన్ని బహుమతిగా అందజేశారు. ఈ కార్యక్రమంలో జహీర్ హుస్సేన్ తనలో మత పరమైన ఏదైనా తేడాలు లేవని స్పష్టం చేశారు. హిందూ దేవాలయానికి తన ముక్కును చెల్లించడం పట్ల ఎంతో ఆనందంగా ఉన్నట్లు తెలిపారు. జహీర్ హుస్సేన్ చేసిన ఈ పని సోషల్ మీడియాలో నెటిజన్లను ఆకట్టుకుంది. హిందూ-ముస్లిం ఐక్యతకు జహీర్ హుస్సేన్ ఒక ఆదర్శంగా నిలిచారని ప్రశంసలు కురుస్తున్నాయి.

Related Posts
నేడు డీఎస్సీ అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేయనున్న సీఎం రేవంత్‌ రెడ్డి
CM Revanth Reddy will hand over appointment documents to DSC candidates today

హైదరాబాద్‌: డీఎస్సీ-2024 ద్వారా ఎంపికైన నూతన ఉపాధ్యాయులకు ఇవాళ సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి ఎల్బీ స్టేడియం వేదికగా నియామక పత్రాలను అందజేయనున్నారు. ఈ మేరకు Read more

కేజ్రీవాల్‌పై దాడికి యత్నం
liquid thrown on arvind kej

ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై దాడికి ట్రై చేసారు. ఆయనపై ఒక వ్యక్తి ద్రవ పదార్థం (లిక్విడ్) విసిరిన Read more

AP : ఏపీకి మరో భారీ ప్రాజెక్టు
AP Project

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో భారీ పారిశ్రామిక ప్రాజెక్టు రానున్నదనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే గ్రీన్ ఎనర్జీ రంగంలో కీలక పెట్టుబడులు వచ్చిన నేపథ్యంలో, ఇప్పుడు అల్యూమినియం పరిశ్రమలో Read more

మోడీ డైరెక్షన్‌లోనే రేవంత్ పనిచేస్తున్నాడు : ఎమ్మెల్సీ కవిత
Revanth is working under Modi direction.. MLC Kavitha

కుటుంబ పాలనకు కేరాఫ్ అడ్రస్ ఎనుముల రేవంత్ రెడ్డి హైదరాబాద్‌: ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ డైరెక్ష‌న్‌లో సీఎం రేవంత్ రెడ్డి క‌లిసి ప‌ని చేస్తున్నారు.. ఆయ‌న ఆర్ఎస్ఎస్ Read more

Advertisements
×