రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఫై మురళీమోహన్ క్లారిటీ..!

సినీ నటుడు , మాజీ ఎంపీ మురళీమోహన్ మళ్లీ రాజకీయాల్లోకి రాబోతున్నారా..? అంటే అవునంటే అంటున్నాయి టీడీపీ వర్గాలు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడటంతో మురళీమోహన్ రాజకీయాలు చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. తాజాగా తన పొలిటికల్ రీఎంట్రీపై మురళీమోహన్ స్పందించారు. సీఎం చంద్రబాబు తనను మళ్లీ రాజకీయాల్లోకి ఆహ్వానించిన మాట వాస్తవమేనని, అయితే మళ్లీ రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదన్నారు.

తాజాగా రాజమండ్రికి వచ్చిన మురళీమోహన్ మాట్లాడుతూ.. రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గంలోని ఏడుగురు ఎమ్మెల్యేలను, రాజమండ్రి ఎంపీగా గెలుపొందిన దగ్గుబాటి పురంధేశ్వరిని అభినందించాలని వచ్చినట్లు తెలిపారు. తన హయాంలో ప్రారంభించిన ఫ్లైఓవర్, ఈఎస్ఐ ఆసుపత్రుల నిర్మాణాలను పరిశీలించినట్లు తెలిపారు. తన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని రాజకీయాలు చేశానని, డబ్బులు ఎలా సంపాదించాలో తనకు తెలుసునని, అక్రమాలు చేయాల్సిన అవసరం లేదన్నారు.

వైసీపీ నేత, మాజీ ఎంపీ మార్గాని భరత్ తన మీద చేసిన ఆరోపణల్ని ఖండించారు. తాను ఇసుక అమ్ముకున్నానంటూ భరత్ తనపై నిరాధార ఆరోపణలు చేశారంటూ మండిపడ్డారు. రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు రాజకీయాల్లో రాణిస్తున్నారని, ఆయనకు తన మద్దతు ఉంటుందన్నారు. మోరంపూడి ఫ్లైఓవర్ ఫ్లైఓవర్ ఎవరు శంకుస్థాపన చేశారో మాజీ ఎంపీ మార్గాని భరత్ గుండె మీద చేయి వేసుకొని చెప్పాలన్నారు. ఈ ఈ విషయాన్ని ఆయన విజ్ఞతకే వదిలేస్తా అన్నారు.