పవన్ దెబ్బకు ముద్రగడ పేరు అధికారికంగా మారింది

పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను ఓడించకపోతే తన పేరు ముద్రగడ పద్మనాభం కాదు ముద్రగడ పద్మ రెడ్డి గా మార్చుకుంటానని సవాల్ చేసిన ముద్రగడ ..తన సవాల్ ను స్వీకరించారు. పిఠాపురం లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 70 వేల పైచిలుకుతో గెలుపొందడమే కాదు ఏపీ ఉప ముఖ్యమంత్రి తో పాటు పలు శాఖలకు మంత్రిగా బాధ్యతలు సైతం చేపట్టారు. ఇక పవన్ గెలుపు తో జనసేన శ్రేణులు , అభిమానులు ముద్రగడ ఫై సెటైర్లు వేయడం మొదలుపెట్టారు. దీంతో తన పేరును మార్చుకున్నాడు. రిజిస్టర్ అధికారులు ముద్రగడ పద్మనాభం పేరును.. ముద్రగడ పద్మనాభ రెడ్డి గా మారుస్తూ.. గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.

ముద్రగడ పద్మనాభం ఎన్నికల ముందు వైసీపీలో చేరారు. అంతకు ముందు జనసేనలో చేరే ప్రయత్నం జరిగింది. వపన్ తో కలిసి పని చేయటానికి సిద్దమని ముద్రగడ చెప్పుకొచ్చారు. కానీ, ముద్రగ ఇంటికి పవన్ వస్తారనే ప్రచారం జరిగినా సాధ్యపడలేదు. దీంతో, జనసేనలో చేరకూడదని నిర్ణయించిన ముద్రగడతో వైసీపీ నేతలు టచ్ లోకి వెళ్లారు. ఫలితంగా ఆయన వైసీపీలో చేరారు. పిఠాపురంలో పవన్ కు వ్యతిరేకంగా ప్రచారం చేసారు. పవన్ ను ఓడిస్తానని శపథం చేసారు. పవన్ ను ఓడించలేకపోతే తాను పద్మనాభ రెడ్డిగా పేరు మార్చుకుంటానని శపథం చేసారు. ఎన్నికల్లో పవన్ భారీ మెజార్టీతో విజయం సాధించారు. దీంతో, ముద్రగడ పేరు ఎప్పుడు మార్చుకుంటారంటూ జనసేన శ్రేణులు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించాయి. పేరు మార్పుకు వీలుగా అధికారిక ప్రక్రియకు ముద్రగడ దరఖాస్తు చేసారు. తాజాగా ముద్రగడ పేరును పద్మనాభ రెడ్డిగా మారుస్తూ ప్రభుత్వం నుంచి గెజిట్ జారీ అయంది. మొత్తం మీద పవన్ దెబ్బకు పేరు మారింది.