పుంగనూరులో ఉద్రిక్తత.. మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటిపై రాళ్ల దాడి

చిత్తూరు జిల్లా పుంగనూరులో మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ మాజీ ఎంపీ రెడ్డప్ప తన ఇంట్లో ఇటీవల దాడులకు గాయపడ్డ వైసీపీ శ్రేణులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఎంపీ మిథన్ రెడ్డి హాజరయ్యారు.

ఈ విషయం టీడీపీ శ్రేణులకు తెలియడంతో సమావేశాన్ని అడ్డుకునేందుకు యత్నించారు. రెడ్డప్ప ఇంటిని చుట్టుముట్టి రాళ్లు రువ్వారు. రెడ్డప్ప ఇంటి నుంచి ఎంపీ మిథున్ రెడ్డి వెళ్లిపోవాలని డిమాండ్ చేసారు. ఈ ఘటనతో అటు వైసీపీ శ్రేణులు కూడా రెడప్ప ఇంటి వద్దకు భారీగా చేరుకుంటున్నారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. రెడ్డప్ప ఇంటి వద్ద భారీగా మోహరించారు. రెండు వర్గాలను చెదరగొట్టారు.

దీనిపై ఎంపీ మిథున్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, తమకు అవకాశం వస్తుందని పేర్కొన్నారు. వినుకొండలో వైసీపీ నాయకుడిని నరికి చంపారు. ప్రతి నియోజకవర్గంలోనూ దాడులు జరుగుతున్నాయి. ప్రభుత్వ ఆస్తులపై దాడి చేస్తున్నారు. బాధితులపైనే కేసులు పెడుతున్నారు.

టీడీపీనేతలు చెడ్డ ఒరవడికి శ్రీకారం చుట్టారు. ఇది సరైన పద్ధతి కాదు. దాడులకు బీజం వేస్తే మళ్లీ గొడవలు జరిగే అవకాశం ఉంది. శాంతియుద్ధంగా పరిపాలన చేయాలి. మేము అధికారంలోకి వస్తే టీడీపీ వాళ్లు కూడా ఇలాంటివి చవి చూడాల్సి వస్తుంది. ఇది మంచి సంస్కృతి కాదు. ఇప్పటికైనా దాడులు ఆపాలి.” అని మిథున్ రెడ్డి సూచించారు.